మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే చిత్రం టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా మొదటి రోజు 4 కోట్ల షేర్ సాధించి పర్వాలేదనిపించినా తర్వాతి రోజు నుండి ఎక్కడా తగ్గకుండా పెర్ఫార్మ్ చేస్తోంది. ఆదివారం వసూళ్లు మొదటిరోజు వసూళ్లతో సమానంగా రావడంతో ప్రతిరోజూ పండగే టీమ్ ఊపిరి పీల్చుకుంది. తమ సినిమా హిట్ అన్న భావనకు వచ్చేసింది. ఇక నాలుగో రోజు అయిన సోమవారం కూడా సినిమా ఎక్కడా తగ్గలేదు. వర్కింగ్ డే కాబట్టి వసూళ్ళలో కొంచెం తేడా వచ్చినా మరీ దారుణంగా ఏం పడిపోలేదు. నాలుగు రోజులకు కలిపి ప్రతిరోజూ పండగే 12 కోట్ల షేర్ సాధించి టీమ్ కు ఆనందాన్నిచ్చింది.
ఇక రేపు క్రిస్మస్ సందర్భంగా సెలవు కావడంతో ఈరోజు సాయంత్రం నుండే వసూళ్లు మళ్ళీ పెరుగుతాయి. రేపు కూడా ఆదివారం రేంజ్ లో వసూళ్లు వస్తే, ప్రతిరోజూ పండగే తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ కు చేరుకునే అవకాశముంది. ఈ సినిమాకు రెండో వారం కూడా ఎదురులేదు. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ పండగే నిజంగా కలెక్షన్స్ పరంగా ప్రతిరోజూ పండగ లాగానే ఉంది. మరోవైపు ఈ చిత్రంతో పాటు విడుదలైన రూలర్, దొంగ, దబంగ్ 3 చిత్రాలకు కనీస స్థాయి వసూళ్లు కూడా రాకపోవడం కూడా కలిసొచ్చింది అనే చెప్పాలి.
మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కుటుంబ బంధాలకు పెద్ద పీట వేశారు. ఈ చిత్రంలో రావు రమేష్ పాత్ర ప్రధానంగా హైలైట్ అయింది. సాయి ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా ఈ చిత్రంలో నటించింది. థమన్ అందించిన పాటలు సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ గా మిగిలింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెల్సిందే. పూర్తి రన్ లో ప్రతిరోజూ పండగే ఎంత కలెక్ట్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా తేజ్ ఎదురుచూస్తోన్న బ్రేక్ ప్రతిరోజూ పండగేతో వచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ హీరో సోలో బ్రతుకే సో బెటరు అనే మరో యూత్ ఫుల్ చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2sfOg4G
Comments
Post a Comment