Skip to main content

‘సుబ్రమణ్యపురం’ ట్రైలర్ కు ఫిదా అయిన అఖిల్

subramanyapuram trailer launchభగవంతుడి ఉనికి అనేది నమ్మకం అనే పునాదుల మీద ఉంటుంది. ఆ నమ్మకం లేని వ్యక్తి భగవంతుడిపై చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి. కాపాడవలసిన భగవంతుడి ఆగ్రహాం తట్టుకోవడం సాధ్యం అవుతుందా..? సుబ్రమణ్యపురం లో దాగున్న రహాస్యం ఏంటి..? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన చిత్రం ‘సుబ్రమణ్యపురం’. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ‘సుబ్రమణ్యపురం’ ఇండస్ట్రీ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గా మారింది. ఇప్పటికే హిందీ శాటిలైట్, ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ లు పూర్తి అయ్యాయి. బాహుబలి, గరుడ వేగ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీం ‘సుబ్రమణ్యపురం ’ కు వర్క్ చేసారు. బాలసుబ్రమణ్యం పాడిన థీమ్ సాంగ్ హైలెట్ గా నిలుస్తుంది. సెన్సిబుల్ హీరో సుమంత్, ఇషా రెబ్బ జంటగా నూతన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి రూపొందించిన ‘‘సుబ్రమణ్యపురం’’ ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. అక్కినేని అఖిల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మాట్లాడుతూ:

 

అఖిల్ అక్కినేని మాట్లాడుతూ:

‘ఇలాంటి కథలు దొరకడం చాలా కష్టం. ఎప్పుడో కానీ ఇలాంటి కథలు సెట్ అవవు. నేను థ్రిలర్స్ చూడటానికి పెద్దగా ఇష్టపడను కానీ ‘సుబ్రమణ్యపురం’ ట్రైలర్ చూస్తుంటే సినిమా చూడాలనిపిస్తుంది.టీం ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి.
భయాన్ని కలిగించకుండా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయగలిగాడు దర్శకుడు. సుమంత్ అంటే నాకు ప్రత్యేక మైన అభిమానం. ఈ సినిమా తప్పకుండా బిగ్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను.

 

సుమంత్ మాట్లాడుతూ:

‘‘నా లాస్ట్ సినిమా లో నాపేరు కార్తిక్, ఈ సినిమాలో కూడా అదే పేరు లాస్ట్ సినిమాలాగే ఇది కూడా సక్సెస్ అవుతుందని సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నమ్ముతున్నాను. నాకు థ్రిలర్స్ పెద్దగా నచ్చవు కానీ సంతోష్ కథ
చెబుతున్నప్పుడు అతని నారేషన్ కి బాగా ఇంప్రెస్ అయ్యాను. ఇతను చెప్పినది విజువల్ గా మార్చడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సినిమా అంతా చూసాను, చాలా కాన్పిడెంట్ గా ఉన్నాను.త్వరలో మీముందుకు రాబోతున్నాం, టీం అందరికీ నా అభినందనలు’’ అన్నారు.

 

మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ:

నిర్మాత నాకు మంచి స్నేహితుడు, పైనాన్షియర్ గా ఉన్న అతను నిర్మాత గా మారతానంటే నేను వద్దు అన్నాను. కానీ సుబ్రమణ్యపురం ట్రైలర్ చూసాక ఇది కార్తికేయను మించి విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. కంటెంట్ బాగుంది పెద్ద విజయం సాధిస్తుంది. 500 కి పైగా థియేటర్స్ లో విడుదలవుతుంది’’ అన్నారు.

 

హీరోయిన్ ఇషా రెబ్బ మాట్లాడుతూ:

‘‘నాకు థ్రిలర్స్ అంటే చాలా ఇష్టం, నాకు బాగా నచ్చిన కథ ఇది. దర్శకుడు సంతోష్ స్ర్కిప్ట్ చెప్పినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. కథ విషయంలో అతనికి చాలా క్లారిటీ ఉంది. సుమంత్ మంచి కో ఆర్టిస్ట్, ఈ షూటింగ్ పిరియడ్
లో మంచి ప్రెండ్స్ అయ్యాము.టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిర్మాత సుధాకర్ రెడ్డిగారు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మరిచిపోలేను, ఆయన మరిన్ని మంచి సినిమాను చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

 

నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ:

‘‘ఫైనాన్షియర్ గా ఉన్న నేను కేవలం సంతోష్ చెప్పిన కథ నచ్చే నిర్మాతగా మారాను. ఫైనాన్షియర్ గా చాలా సినిమాలకు సపోర్ట్ చేసాను. ఆర్టిస్ట్ లు, టెక్నిషియన్స్ ఇచ్చిన సపోర్ట్ తో ఈ సినిమాను మూడు నెలలలో కంప్లీంట్ చేసాం. డిసెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం. ’’ అన్నారు.

 

దర్శకుడు సంతోష్ జాగర్లమూడి మాట్లాడుతూ:

‘‘ ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ నిర్మాత సుధాకర్ రెడ్డి గారే. దర్శకుడిగా ఫస్ట్ ప్రాజెక్ట్ రావడం ఎంత కష్టమో నాకు తెలుసు. పనిలో ఎలాంటి ఒత్తడి కలగకుండా నిర్మాత నా వెనుక నిలబడి ప్రాజెక్ట్ ని నడిపించారు.
కానీ నిర్మాత ఇచ్చిన సపోర్ట్ తో ఈ ప్రాజెక్ట్ కేవలం మూడు నెలల్లో కంప్లీట్ చేసాం. కథ వినేముందు సుమంత్ గారు నాకు థ్రిలర్స్ పెద్దగా నచ్చవు అన్నారు, కానీ కథ నచ్చి వెంటనే ఒప్పుకున్నారు. కార్తికేయకు దీనికి ఎలాంటి
పోలికలు లేవు, ఇది కంప్లీంట్ ఢిపరెంట్ స్టోరీ ఒక సుబ్రమణ్యశ్వేర స్వామి మాత్రమే కామన్. ఇది ఒక డివోషనల్ థ్రిల్లర్

‘ఎవరికైనా కష్టం వస్తే భగవంతుడికి చెప్పుకుంటాం.. కానీ భగవంతుడే కష్టానికి కారణం అయితే ఎవరికి చెప్పుకుంటాం’అనేదే బేసిక్ లైన్ . ఈ సినిమాలో సురేష్ గారు, సాయికుమార్ గారు ఢిపరెంట్ రోల్స్ ప్లే చేసారు.
శేఖర్ చంద్ర ఈ సినిమాకి మరో హీరో అనుకోవచ్చు. అలాంటి మ్యూజిక్ అందించాడు. సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను’’ అన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zhybvy

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...