Skip to main content

అక్టోబర్‌ 18న దసరా కానుకగా మాస్‌ హీరో విశాల్‌ 25వ చిత్రం ‘పందెంకోడి 2’

pandem kodi 2 movie get release dateమాస్‌ హీరోగా విశాల్‌ కథానాయకుడిగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పందెంకోడి 2‘. వీరిద్దరి కలయికలో 13 సంవత్సరాల క్రితం వచ్చిన ‘పందెంకోడి‘ విశాల్‌ కెరీర్‌లోనే బిగెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మళ్ళీ విశాల్‌, లింగుస్వామి కాంబినేషన్‌లో వస్తోన్న ‘పందెంకోడి 2’ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ‘పందెం కోడి 2’ మాస్‌ హీరో విశాల్‌కి 25వ సినిమా కావడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కి, ట్రైలర్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతి లాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను అక్టోబర్‌ 14న హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ – ”నా కెరీర్‌లో పందెంకోడి చిత్రం ఎంతో ప్రత్యేకం. హీరోగా తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ప్రేక్షకులకు నన్ను దగ్గర చేసిన చిత్రమిది. ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌ సహా అన్నీ కమర్షియల్‌ హంగులతో తెరకెక్కిన పందెంకోడి చిత్రానికి సీక్వెల్‌ను పదమూడేళ్ల తర్వాత చేస్తున్నాను. డైరెక్టర్‌ లింగుస్వామిగారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 18న విడుదలవుతున్న ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది” అన్నారు.

అక్టోబర్‌ 14న ప్రీ రిలీజ్‌ వేడుక
నిర్మాత ఠాగూర్‌ మధు మాట్లాడుతూ – ”ఇటీవల విడుదలైన ‘పందెంకోడి 2’ ట్రైలర్‌కు ట్రెమెండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే తమిళంలో విడుదలైన పాటలకు హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. విశాల్‌, యువన్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్‌ హిట్స్‌ అయ్యాయి. పందెంకోడి తర్వాత ఈ చిత్రం వారిద్దరి కాంబినేషన్‌లో మరో హిట్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా అద్భుతంగా నటించారు. ఇక వరలక్ష్మి శరత్‌కుమార్‌గారి పాత్ర సినిమాలో విశాల్‌గారి పాత్రకు ధీటుగా ఉంటుంది. ఆమె పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. ఇలాంటి ఓ మంచి చిత్రానికి అసోసియేట్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతే కాకుండా విశాల్‌ నటించిన 25వ చిత్రాన్ని మా బ్యానర్‌లో విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అక్టోబర్‌ 18న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతుంది. అక్టోబర్‌ 14న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించబోతున్నాం” అన్నారు.

దర్శకుడు ఎన్‌.లింగుస్వామి మాట్లాడుతూ ”పందెంకోడి తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌ తప్పకుండా అందర్నీ అలరిస్తుంది. విభిన్న కథాంశం, డిఫరెంట్‌గా సాగే హీరో క్యారెక్టరైజేషన్‌, థ్రిల్‌ చేసే యాక్షన్‌ ఎపిసోడ్స్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యే ఎమోషన్స్‌… ఇలా ఒక కమర్షియల్‌ మూవీలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ‘పందెం కోడి 2’లో ఉన్నాయి. ఈ సినిమా విశాల్‌కి, నాకు మరో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది” అన్నారు.

మాస్‌ హీరో విశాల్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాజ్‌కిరణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: కె.ఎ.శక్తివేల్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాతలు: విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా, దర్శకత్వం: ఎన్‌.లింగుస్వామి.

 



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OWKUNe

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...