
స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యిందని , త్వరలోనే చిరంజీవి కి పూర్తీ నరేషన్ మరోసారి ఇవ్వడమే బ్యాలెన్స్ గా ఉందని తెలుస్తోంది . కొరటాల శివ సినిమాలన్నీ సామాజిక సందేశంతో కూడుకున్న చిత్రాలు అన్న విషయం అందరికి తెలిసిందే . కాగా ఈ సినిమా కూడా సందేశాత్మకంగా ఉండనుంది . ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం చేస్తూ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే . ఆ సినిమాని కంప్లీట్ చేసి వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . జనవరిలో సినిమా ప్రారంభం అయినప్పటికీ కొంత గ్యాప్ తీసుకొని రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు .
English Title: Koratala siva chiranjeevi movie starts from january 2019
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OSLmwZ
Comments
Post a Comment