
నేను తప్పు చేయలేదు కాబట్టి సారీ చెప్పను అంతేకాదు న్యాయం కోసం కోర్టుని ఆశ్రయిస్తాను , శృతి హరిహరన్ కు తగిన బుద్ది చెబుతాను అంటూ ఆవేశంతో అంటున్నాడు అర్జున్ . ఇక శృతి హరిహరన్ కూడా తక్కువేమీ తినలేదు నేను నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను , ఎలాంటి సవాళ్ళ నైనా ఎదుర్కోవడానికి నేను సిద్దం . తప్పు చేసింది ఒకరైతే నేనెందుకు సారీ చెప్పాలి , ఎందుకు రాజీ పడాలి అంటూ ఎదురు ప్రశ్న వేస్తోంది . సీనియర్ నటుడిగా రాజీ చేయాలనీ ప్రయత్నించి విఫలం కావడంతో అంబరీష్ అసంతృప్తి వ్యక్తం చేసాడు . రాజీ కోసం ప్రయత్నించాను కానీ ఇద్దరూ పంతానికి పోతున్నారు అంటూ తన అశక్తతని వ్యక్తం చేసాడు . ఇద్దరు కూడా రాజీపడేది లేదని కుండబద్దలు కొట్టడంతో ఈ మీటూ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి .
English Title : #Metoo : Ambarish meeting fail between arjun and shruti hariharan
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PWQlZN
Comments
Post a Comment