
ఈ చిత్రం మీద చాలా నమ్మకంగా ఉన్నాడు నాగచైతన్య . సవ్యసాచి తో హిట్ కొట్టి యాక్షన్ హీరోగా టర్న్ కావాలని చూస్తున్నాడు . అక్కినేని హీరోలకు యాక్షన్ హీరో గుర్తింపు రాలేదు . నాగార్జున కొంత పవర్ చూపించాడు కానీ రొమాంటిక్ హీరోగానే ఎక్కువ గుర్తింపు వచ్చింది . మరి నాగచైతన్య కు కూడా యాక్షన్ ఇమేజ్ వచ్చేలా లేదు కానీ ప్రయత్నం అయితే మానడం లేదు . సవ్యసాచి పై అంచనాలు బాగానే ఉన్నాయి . మరి ఆ అంచనాలను అందుకొని హిట్ అవుతుందా ? లేదా ? అన్నది నవంబర్ 2 న తేలనుంది .
English Title: Will nagachaitanya gets hit with savyasachi
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Q1ONOf
Comments
Post a Comment