Skip to main content

రెబ‌ల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన మోస్ట్ క్రేజియ‌స్ట్ ప్రాజెక్ట్ “షేడ్స్‌ ఆఫ్ సాహో”

Superstar Prabhas treats fans with breathtaking glimpses of Saaho on birthdayప్ర‌పంచంలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ‘బాహుబలి చిత్రం గురించి మాట్లాడ‌ని సినిమా ప్రేక్ష‌కుడు లేడు. ప్ర‌పంచ సినిమా ప్రేక్ష‌కుడి కి తెలుగు సినిమా ని పరిచ‌యం చేసిన ఘ‌న‌త బాహుబ‌లి మాత్ర‌మే.. తెలుగు సినిమా స‌త్తాని ద‌మ్ముని తెలియ జేసిన బాహుబ‌లి చిత్రం తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మెట్ట‌మెద‌టి చిత్రం ‘సాహో’. రన్ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ సాహోకి దర్శకుడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఉన్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సాహో లుక్ ను అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా “షేడ్స్‌ ఆఫ్ సాహో ” విడుదల చేస్తున్నారు.. ఈ చిత్రం పై ప్ర‌భాస్ అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్ష‌కుల్లో సైతం వున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని షేడ్‌ ఆఫ్ సాహు ని ఛాప్ట‌ర్స్ గా విడుద‌ల చేయ‌నున్నారు. గతంలో బాహుబలి కంక్లూజన్ ఫస్ట్ లుక్ ని సైతం రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగానే విడుదల చేయడం జరిగింది. అదే ఆనవాయితిని కొనసాగిస్తూ మరోసారి ఈ షేడ్‌ ఆప్ సాహో ని ఫ్యాన్స్ కి బర్త్ డే ట్రీట్ ఇచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ లుక్ ప్రభాస్ అభిమానుల్నే కాకుండా సామాన్య సినీ ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకోవడమే కాదు వారిలో మరింత ఉత్కంఠని పెంచింది. రిలీజ్ చేసిన ఒన్ మినిట్ 22 సెకండ్స్ విజువ‌ల్ వండ‌ర్ ప్రేక్ష‌కుడ్ని రిపీట్ చూసేలా ఆక‌ట్టుకుంది.. ఇలాంటి విజువ‌ల్ ఇండియ‌న్ సినిమాలో ఇప్ప‌టివ‌ర‌కూ రాలేద‌నే చెప్పాలి..

 

ఏప్రిల్ లో సాహో ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ జరగడం ఆ తరువాత బాహుబలి 2తో పాటు సాహో టీజర్ ని విడుదల చేయడం, ఇప్పుడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన “షేడ్స్‌ ఆఫ్ సాహో” ఈ చిత్రం పై భారీగా అంచనాలు పెంచాయి. అందుకు తగ్గట్లుగానే యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్-విక్కి ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగారు. సాహోలో ప్రభాస్ తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్ ఫిమేల్ లీడ్ చేస్తుంది. హైలీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ లో ఇటలీలో చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను… అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు.

 

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ… పాన్ ఇండియా సూప‌ర్‌స్టార్‌ ప్రభాస్ హీరోగా మూడు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మా బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం సాహో. ప్ర‌భాస్ గారి గ‌త‌ భ‌ర్త‌డే కి టీజ‌ర్ రిలీజ్ చేశాం.. త‌రువాత షూటింగ్ లో మా యూనిట్ అంతా బిజిగా వున్నారు. అయితే ఇండియా మెత్తం ప్ర‌భాస్ గారి అభిమానులు సాహో అప్‌డేట్స్ ఇవ్వ‌మ‌ని విప‌రీతంగా సోష‌ల్ మీడియాలో అడ‌గ‌టం తో మా యూనిట్ వారి ఆనందాన్ని రెట్టింపు చెయ్యాల‌నే వుద్దేశ్యంతోనే “షేడ్స్‌ ఆఫ్ సాహో ” పేరున ఛాప్ట‌ర్స్ గా అందివ్వ‌నున్నారు. దానిలో భాగంగా ప్ర‌భాస్ గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా “షేడ్ ఆఫ్ సాహో ఛాప్ట‌ర్‌-1” ని విడుద‌ల చేశాము. అద్భుతమైన స్పందన రావడం చాలా హ్యాపీ గా ఉంది. ప్రస్తుతం ఇటలీ లో చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికి దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయింది. ప్రభాస్ స్టైలిష్ పెర్ఫార్మన్స్, సుజిత్ వరల్డ్ క్లాస్ విజన్, శ్రద్ధా కపూర్ అందచందాలు, బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ టాప్ క్లాస్ మ్యూజిక్, మధి గ్రాండియర్ విజువల్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. అని అన్నారు

 

బ్యానర్ – యువి క్రియేషన్స్
దర్శకుడు – సుజీత్
నిర్మాతలు – వంశీ-ప్రమోద్-విక్కి
సంగీతం – శంకర్-ఎహసాన్-లాయ్
సినిమాటోగ్రాఫర్ – మధి
ఆర్ట్ డైరెక్టర్ – సాబు సిరీల్
ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PP9U6o

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...