
తాజాగా నిన్న దునియా విజయ్ రెండో భార్య అయిన కీర్తి గౌడని మొదటి భార్య నాగరత్న చెప్పుతో కొట్టడం సంచలనం సృష్టించింది . దాంతో కీర్తి గౌడ పోలీసులకు ఫిర్యాదు చేసింది . నాగరత్న మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సమయంలో నాగరత్న లేకపోవడంతో ఆమె కూతురు మోనికా ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్ళారు దాంతో దునియా విజయ్ కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు . నేరం చేసింది నాగరత్న అయితే శిక్ష అనుభవిస్తోంది నా కూతురు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు . తల్లి చెప్పుడు మాటలు విని నా కూతురు కూడా నన్ను ద్వేశిస్తోందని వాపోతున్నాడు దునియా విజయ్ . పాపం రెండో పెళ్ళి ఏమంట చేసుకున్నాడో అప్పటి నుండి సుఖం ఏమో కానీ నరకం మాత్రం చూస్తున్నాడు ఈ నటుడు . నిత్యం గొడవలతో రోడ్డున పడుతుండటంతో దునియా విజయ్ పరువు మొత్తం మంటగలిసింది .
English Title: Duniya vijay family problems again
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2qecYxw
Comments
Post a Comment