Skip to main content

ఈ విజయం స్ఫూర్తితో ‘పందెంకోడి 3’ ప్లాన్‌ చేస్తున్నాం – మాస్‌ హీరో విశాల్‌

vishal pandem kodi 2 movie press meetమాస్‌ హీరోగా విశాల్‌ కథానాయకుడిగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పందెంకోడి 2’. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతి లాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 18న విడుదలై సూపర్‌ ఓపెనింగ్స్‌తో సెన్సేషనల్‌ హిట్‌ సాధించింది. 6 కోట్లకు కొన్న ‘పందెంకోడి 2’.. 5 రోజులకే 5 కోట్ల 63 లక్షలకు పైగా షేర్‌బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ప్రేక్షకుల అపూర్వ ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ ”పందెం కోడి చిత్రం నా కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్‌ మూవీ. నేనెక్కడికి వెళ్ళినా అందరూ పందెం కోడి.. అని పిలిచేవారు. ఈ చిత్రానికి సీక్వెల్‌ చెయ్యాలనుకున్నప్పుడు ఆ సినిమా రేంజ్‌లో చెయ్యగలమా అనే ఒక టెన్షన్‌ ఉండేది. అందువల్లే పందెంకోడి 2 చెయ్యడానికి 13 ఏళ్ళు పట్టింది. నేను, లింగుస్వామి కథను నమ్మి ఈ సినిమా చేశాం. లింగుస్వామి ఈ సినిమాను అద్భుతంగా తీశారు. ప్రేక్షకులు ఈ సినిమాను మేం ఊహించిన దానికంటే పెద్ద హిట్‌ చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్‌ కూడా బాగా పండింది. నాకు ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చింది. నిర్మాతగా కూడా మంచి విజయాన్ని ఇచ్చింది. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్‌ ఈ సినిమాలో కాంట్రాస్ట్‌గా ఉండే ఓ డిఫరెంట్‌ రోల్‌ చేసింది. తన పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. అలాగే విలన్‌గా నటించిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ సినిమాకి మంచి గ్రిప్‌ తీసుకొచ్చింది. యువన్‌ శంకర్‌రాజా మ్యూజిక్‌ కూడా ఈ సినిమాని పెద్ద రేంజ్‌కి తీసుకెళ్లింది. ఈ విజయం స్ఫూర్తితో ‘పందెంకోడి 3’ని ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.

కీర్తి సురేష్‌ మాట్లాడుతూ ”మహానటి’ వంటి క్లాసిక్‌ మూవీ తర్వాత ఒక మంచి మాస్‌ క్యారెక్టర్‌ ఈ సినిమాలో చేశాను. ఈ క్యారెక్టర్‌ చేస్తున్నప్పుడే థ్రిల్‌ అనిపించింది. రిలీజ్‌ అయ్యాక నా పెర్‌ఫార్మెన్స్‌ని అందరూ అప్రిషియేట్‌ చెయ్యడం చాలా ఆనందం కలిగించింది. ‘పందెం కోడి 2′ అనేది నా కెరీర్‌లో ఓ స్పెషల్‌ మూవీ అయింది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌” అన్నారు.

లింగుస్వామి మాట్లాడుతూ ”పందెంకోడి’ కంటే పందెంకోడి 2’కి రెస్పాన్స్‌ టెరిఫిక్‌గా ఉంది. ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌. ఈ సినిమా కంటే పెద్ద రేంజ్‌లో ‘పందెంకోడి 3’ ఉండేలా స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాం” అన్నారు.

ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ”ఇంతటి మంచి హిట్‌ సినిమాని మాకు అందించిన విశాల్‌కి, లింగుస్వామికి, ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఈ దసరా పండగకు మా సంస్థకు మంచి విజయాన్ని అందించిన అందరికీ థాంక్స్‌” అన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OLf7Qc

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...