Skip to main content

ముళ్లగూరు అనంతరాముడు అగ్ర నిర్మాత కావాలి – శ్రీకాంత్

2 friends audio launchఅనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై.. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో.. ముళ్లగూరు అనంతరాముడు-ముళ్లగూరు రమేష్ నాయుడు తెలుగు-కన్నడ భాషల్లో సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘టు ఫ్రెండ్స్’. ‘ట్రూ లవ్’ అనేది ట్యాగ్ లైన్. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫర హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకుడు.

ఈనెల 26న విడుదలవుతున్నఈ చిత్రం ముందస్తు విడుదల వేడుక (ప్రీ రిలీజ్ ఈవెంట్) ను హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్, ప్రముఖ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సి.కళ్యాణ్, ప్రముఖ ఫైనాన్సియర్ నారపురెడ్డి, ప్రముఖ నటి కవిత, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వీరినాయుడు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సి ఐ ఎస్ ఎఫ్) హరిప్రసాద్ రాజులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తన తొలి చిత్రం (టు ఫ్రెండ్స్) నిర్మాణంలో తనకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని, అయితే సినిమా చాలా బాగా రావడం వల్ల వాటిని అనుభవ పాఠాలుగా తీసుకొని, వదిలేశానని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తానని చిత్ర నిర్మాత ముళ్లగూరు అనంతరాముడు తెలిపారు. అయితే కొత్తగా సినిమాలు తీసేవాళ్ళు మాత్రం… ముందుగా అన్నీ తెలుసుకొని సినిమా నిర్మాణ రంగంలో అడుగు పెట్టాలని ఆయన హితవు పలికారు. తెలుగుతోపాటు కన్నడలోనూ రూపొందిన ఈ చిత్రాన్ని ఇప్పటికే కన్నడలో విడుదల చేశామని, అక్కడ మంచి వసూళ్లు సాధించడం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. హీరో శ్రీకాంత్ ఈ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేరు.

అన్ని రంగాల్లో అసాధారణ విజయాలు సాధిస్తున్న అనంత రాముడు సినిమా రంగంలోనూ అద్భుతాలు ఆవిష్కరించాలని అంబికా కృష్ణ ఆకాంక్షించారు. ట్రూ లవ్’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ‘టు ఫ్రెండ్స్’ ట్రూ సక్సెస్ సాధించాలని అభిలషించారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథానాయకుడు కార్తీక్ కోసం ఈ వేడుకకు వచ్చానని, హీరోగా అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. రైతు కుటుంబం నుంచి సినిమా రంగంలోకి వచ్చిన అనంతరాముడు అంచలంచెలుగా అగ్ర నిర్మాత కావాలని శ్రీకాంత్ అభిలషించారు.
తాను నిర్మాత కావడానికి కారకులయిన ప్రముఖ ఫైనాన్సియర్ నారపురెడ్డి మిత్రులు ముళ్లగూరు ఆనంతరాముడుగారు నిర్మాతగా శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకత్వంలో రూపొందిన ‘టు ఫ్రెండ్స్’ ఘన విజయం సాధించాలని సి.కళ్యాణ్ కోరుకున్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ఆనంతరాముడుగారు వంటి గట్స్ ఉన్న నిర్మాతల అవసరం ఇండస్ట్రీకి ఉందన్నారు. ఈ సినిమా చూశానని, దర్శకుడు శ్రీనివాస్ సినిమాను అద్భుతంగా తీర్చి దిద్దారని.. ‘టు ఫ్రెండ్స్’ చిత్రాన్ని రెండు రాష్ట్రాల్లో 150కి పైగా ధియేటర్స్ లో ఈనెల 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ జి.ఎల్.బి మాట్లాడుతూ.. “ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు అందించిన సహాయ సహకారాల వల్ల సినిమా చాలా బాగా వచ్చింది” అన్నారు.

ఈ సందర్భంగా అంబికా కృష్ణను ‘టు ఫ్రెండ్స్’ చిత్ర బృందం ఘనంగా సత్కరించింది. అతిదులందరికీ చిరు జ్ఞాపికలు బహూకరించింది.

ఇంకా ఈ కార్యక్రమంలో ఈ చిత్రానికి కథ, మాటలు, సంగీతం సమకూర్చిన పోలూర్ ఘటికాచలం, హీరో అఖిల్ కార్తీక్, సినిమాటోగ్రాఫర్ సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ధనరాజ్, స్నిగ్ధ, సమీర్ దత్త, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, సాయిప్రకాష్, సాధు కోకిల, కవిత, రమేష్ భట్, డి.వై.రఘురాం, చిత్ర శెనాయి, శ్రీలక్ష్మి, కృష్ణవేణి, వై.విజయ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పాటలు: చిర్రావూరి విజయ్ కుమార్-వరికుప్పల యాదగిరి-డి.వై.రఘురాం, కొరియోగ్రఫీ: స్వర్ణబాబు, కో-డైరెక్టర్: నాగుల జగన్నాధ్, పీఆర్వో: ధీరజ అప్పాజీ, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, కథ-మాటలు-సంగీతం: పోలూర్ ఘటికాచలం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ముళ్ళగూరు వెంకటేష్ నాయుడు, నిర్మాతలు: ముళ్ళగూరు అనంతరాముడు-ముళ్ళగూరు రమేష్ నాయుడు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ జి.ఎల్.బి



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OLQJhd

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...