Skip to main content

ప్ర‌జ‌ల త‌ర‌పున రాజకీయ అస్ర్తం ఆప‌రేష‌న్ 2019

operation 2019 movie is the political weapon of the peopleఅలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్పించు టి. అలివేలు నిర్మించిన క‌ర‌ణం బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఆప‌రేష‌న్ 2019. శ్రీ‌కాంత్‌, మంచుమ‌నోజ్ న‌టిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశ‌లో హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ…ఈ క‌థ పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ప్ర‌త్యేకించి ఏ పార్టీని బేస్ చేసుకుని కాదు. ఎల‌క్ష‌న్స్ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల్లో ఎవేర్‌నెస్ పెంచ‌డం కోసం చేసిన మూవీ. ఒక సామాన్య వ్య‌క్తి పొలిటీషియ‌న్ అయితే అత‌ను ఎద్దుర్కొనే ప‌రిణామాలు ఎలా ఉంటాయి. ఏవిధంగా ప్ర‌జ‌లు అటు పొలిటీషిన్స్ చేసే పొర‌పాట్ల గురించి ఉంటుంది క‌థ‌.

ఇందులో నేను ప‌క్కా పొలిటీషియ‌న్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తాను. ప్ర‌స్తుతం ఎలాగో ఎల‌క్ష‌న్స్ వ‌స్తున్నాయి కాబట్టి ఈ స‌బ్జెక్ట్‌ని ప్లాన్ చేశాము. అటు పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌ని, ఇటు ప్ర‌జ‌ల్ని ఇద్ద‌ర్నీ టార్గెట్ చేసి చేసిన మూవీ ఇది. ప్ర‌త్యేకించి ఇది ఏ పార్ట‌పార్టీకి సంబంధం ఉండ‌దు. కాని కొన్ని కొన్ని సీన్స్ మాత్రం క‌నెక్ట్ అవుతుంది. గ‌తంలో వ‌చ్చిన ఆప‌రేష‌న్ దుర్యోధ‌న మూవీకి దీనికి సీక్వెల్ కాదు కాని కొన్ని సీన్స్ అలాగ అనిపిస్తాయి. ఈ డైరెక్ట‌ర్‌తో గ‌తంలో నేను మెంట‌ల్ అనే చిత్రం చేశాను. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల అది ఆగిపోవ‌డం జ‌రిగింది. మ‌ళ్ళీ ఈ చిత్రం ఆప‌రేష‌న్ 2019తో మీ ముందుకు వ‌స్తున్నాం. ఈయ‌న‌కు సినిమా త‌ప్ప వేరే ప్ర‌పంచం లేదు. సినిమా అంటే చాలా ప్యాష‌న్‌. ప్రొడ్యూస‌ర్ కూడా చాలా మంచివారు సినిమాకి ఏం కావాల‌న్నా అన్నీ స‌మ‌కూర్చారు. మొన్న‌నే క‌న్న‌డ‌లో ఒక సినిమా చేశాను అందులో నెగిటివ్ క్యారెక్ట‌ర్‌లో చేశాను. అక్క‌డ ఆ చిత్రం సూప‌ర్ హిట్ అయింది. మ‌ల‌యాళంలో కూడా ఒక సినిమా చేశాను. తెలుగులో మార్ష‌ల్ అనే ఒక చిత్రం చేస్తున్నాను షూటింగ్ అవుతుంది. ఆ చిత్రానికి జ‌య‌రాజ్‌గారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మ‌నోజ్ కూడా న‌టించారు.

చాలా డెడికేటెడ్ ప‌ర్స‌న్‌. మా బాబు యాక్టింగ్ కోర్స్ అయిపోయింది. వ‌చ్చే ఏడాదిలో తీసుకొద్దాం అనుకుంటున్నాను. మంచి క‌థ‌లను బ‌ట్టి ముంద‌డుగు వేస్తాను. ఇంకా ఎవ‌రు లాంచ్ చెయ్యాలి ఏంటి అని ప్ర‌త్యేకించి ఏమీ అనుకోలేదు. ఈ సినిమాకి ఓపెన్సింగ్స్ రాగ‌లిగితే ఆడియ‌న్స్ ఆద‌రిస్తారు. ఆప‌రేష‌న్ దుర్యోధ‌న అలానే అయింది ఓపెనింగ్స్ బావుండ‌డంతో సినిమా ఎక్క‌డికో వెళ్ళిపోయింది. ఈ చిత్రంలోని డైలాగ్స్ చాలా నార్మ్‌గా ఉంటాయి నేచ‌ర‌ల్ పొలిటీష‌న్ డైలాగ్స్ లాగానే ఉంటాయి. షూటింగ్ మొత్తం అమెరికాలో చేశాం. ఎన్ ఆర్ ఐ పొలిటీషియ‌న్‌గా మారితే ఎలా అన్న‌ది అంటే అలా అని భ‌ర‌త్ అను నేను టైపులో ఉండ‌దు. నేను ఇంకా తెలంగాణ దేవుడు అని సినిమా చేస్తున్నాను. కేసీఆర్ బ‌యోపిక్ అన్న‌ట్లు ఆయ‌న చిన్న‌ప్ప‌టి నుంచి తీసుకుని జీవిత చ‌రిత్ర చేస్తున్నాను. ఆ చిత్రానికి హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో ఉద్య‌మానికి సంబంధించిన పాట‌లు ఎక్కువ‌గా ఉంటాయి. కోత‌ల రాయుడు అన్న చిత్రం కూడా చేస్తున్నాను. పొలిటిక‌ల్ స్టోరీలు వ‌స్తున్నాయి కాబ‌ట్టి స‌బ్జెక్ట్ న‌చ్చి సినిమాలు చేస్తున్నాను త‌ప్ప నాకు ప్ర‌త్యేకించి పాలిటిక్స్‌లోకి రావాల‌ని చేయ‌డం లేదు. నాకెరియ‌ర్‌ని స‌క్సెస్‌లో ఉండి ఉంటే ప‌క్కాగా ప్లాన్ చేసుకునేవాడ్ని కాని స‌క్సెస్ లేన‌ప్పుడు వ‌చ్చిన‌వ‌న్నీ జాగ్ర‌త్త‌గా చూసుకుని ఒక న‌టుడిగా చేసుకుంటూ వెళ్ళ‌డ‌మే. ప్ర‌స్తుతం డిఫ‌రెంట్ స్టోరీస్ అన్నీ చేసుకుంటూ వెళుతున్నాను నేను జ‌గ‌ప‌తిబాబుగారిలాగా విల‌న్ క్యారెక్ట‌ర్స్ చెయ్య‌డానికి కూడా సిద్ధ‌మ అని ముగించారు.

ఇంకా ఈ చిత్రంలో సునీల్‌, య‌జ్ఞ‌శెట్టి, దీక్షాపంత్‌, హ‌రిత‌, స‌లోని, సుమ‌న్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, నెక్కంటి వంశీ, వినీత్‌కుమార్‌, పోసానికృష్ణ‌ముర‌ళి, జీవ‌, రామ‌రాజు, శివ‌కృష్ణ‌, రామ్‌జ‌గ‌న్‌, స‌మీర్ న‌వీన్‌, ఆర్‌.పి(జ‌బ‌ర్‌ద‌స్త్‌) త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ః ర్యాప్‌రాక్ ష‌కీల‌, ప్రొడ్యూస‌ర్ః టి.అలివేలు, రైట‌ర్‌మ‌రియు డైరెక్ట‌ర్ః క‌ర‌ణం బాబ్జీ, డి.ఓ.పి.వెంక‌ట్‌ప్ర‌సాద్, ఎడిట‌ర్ఃఎస్‌.బి. ఉద్ధ‌వ్‌,



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OVmJ2E

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...