Skip to main content

‘దండుపాళ్యం’ డైరెక్టర్ తో సుమంత్ అశ్విన్

sumanth ashwins next in dandupalyam fame srinivasa rajuఅంతకుముందు ఆ తరువాత, లవర్స్, కేరింత వంటి సూపర్‌హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో సుమంత్ అశ్విన్, ‘దండుపాళ్యం’ సిరీస్ దర్శకుడు శ్రీనివాసరాజు కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది. జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ‘గరుడవేగ’ వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన ఎం.కోటేశ్వరరాజు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో హారర్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ చిత్రీకరణ జరుపుకోనుంది. నవంబర్‌లో రెండో వారంలో ఈ భారీ చిత్రం ప్రారంభమవుతుంది.

ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ‘‘చాలా స్పాన్ ఉన్న సబ్జెక్ట్. అందుకే నాలుగు భాషల్లో సుమంత్ అశ్విన్ హీరోగా ప్లాన్ చేశాం. ఇతర పాత్రల్లో భారీ తారాగణం నటిస్తారు. రీరికార్డింగ్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న హారర్ థ్రిల్లర్ ఇది. అందుకే మణిశర్మగారు ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు. హారర్ థ్రిల్లర్స్‌లోనే ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుంది. దండుపాళ్యం 1, 2, 3 చిత్రాల విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో నేను ఈ సినిమాని చాలా పెద్ద లెవల్‌లో, చాలా హై టెక్నికల్ వేల్యూస్, భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం. గరుడవేగ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఎం.కోటేశ్వరరాజుగారు ఈ సినిమాకి నిర్మాత కావడం చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమాను చేసేందుకు నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం నాకెంతో ఆనందం కలిగిస్తోంది’’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్‌వర్మ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్‌రెడీ స్టార్ట్ అయింది. నవంబర్ రెండో వారంలోనే సినిమా ప్రారంభమవుతుంది. కంటిన్యూగా షెడ్యూల్స్ చేసి నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేశాం’’ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ప్రసాద్, ఆర్ట్: వీరమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌వర్మ, నిర్మాత: ఎం.కోటేశ్వరరాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరాజు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2yH6iwC

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...