
దాంతో రవితేజ సినిమాపై దుష్ప్రచారం జరుగుతోంది . సినిమా రిజల్ట్ ఎలా ఉంటందో అన్న భయంతోనే సకాలంలో విడుదల చేయడం లేదని నెగెటివ్ ప్రచారం సాగుతోంది . రవితేజ మూడు రకాల షేడ్స్ ఉన్న పాత్రలను పోషిస్తున్నాడు . ఇక రవితేజ సరసన ఇలియానా నటించిన ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇద్దరి భవితవ్యాన్ని తేల్చనుంది . రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన మూడు చిత్రాలు కూడా మంచి హిట్ అయ్యాయి . నీకోసం , వెంకీ , దుబాయ్ శీను ,ఇక ఇప్పుడు ఈ సినిమా ఆ చిత్రాల సరసన నిలుస్తుందా లేక ఫ్లాప్ జాబితాలో చేరుతుందా చూడాలి .
English Title: Negative publicity on ravi teja’s amar akbar anthony
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2z5MbHR
Comments
Post a Comment