
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కం.లి. పతాకాలపై గల్లా అశోక్ హీరోగా విజయదశమి రోజున హైదరాబాద్‌లో ప్రారంభమైన చిత్రం `అదే నువ్వు అదే నేను`. నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. శశి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ప్రాంభోత్సవానికి సూపర్‌స్టార్ కృష్ణ, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, శ్రీమతి గల్లా అరుణకుమారి ముఖ్య అతిథులుగా విచ్చేసి యూనిట్ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా…
దిల్‌రాజు మాట్లాడుతూ – “గల్లా అశోక్‌ను మా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ద్వారా పరిచయం చేయనుండటం ఆనందంగా ఉంది. `అదే నువ్వు అదే నేను` అనే టైటిల్‌తో అందరినీ ఆకట్టుకునే చిత్రాన్ని తెరకెక్కిస్తాం. శశి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాలో మిగతా నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం“ అన్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NU8khW
Comments
Post a Comment