నోటా చిత్రం అసలు అల్లు అర్జున్ కోసం రాసారు, అతడితో సినిమా చేయాలని నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రయత్నాలు చేసాడు అయితే దర్శకుడు ఆనంద్ శంకర్ చెప్పిన కథ అల్లు అర్జున్ కు నచ్చకపోవడంతో నాకు ఈ కథ సూట్ కాదని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాడట దాంతో చేసేది లేక విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లారు ఆనంద్ శంకర్. జ్ఞానవేల్ రాజా పంపించిన దర్శకుడు కావడంతో విజయ్ ఆనంద్ శంకర్ చెప్పిన కథ విన్నాడు నచ్చడంతో ఓకే చేసాడు. కట్ చేస్తే ఈరోజు విడుదలైన నోటా చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది.
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా చేస్తున్న సమయంలోనే నోటా రావడంతో దాన్ని రిజెక్ట్ చేసాడు అల్లు అర్జున్. ఒకవేళ అల్లు అర్జున్ కనుక ఈ నోటా చిత్రాన్ని ఓకే చేసి ఉంటే తప్పకుండా మరో ప్లాప్ ని ఎదుర్కొనేవాడు. ఇప్పటికే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే ప్లాప్ తో ఇబ్బందిపడుతున్నాడు అల్లు అర్జున్. ఇది కూడా ప్లాప్ అయితే మరీ దారుణంగా ఉండేది అల్లు అర్జున్ పరిస్థితి అందుకే నోటా ని రిజెక్ట్ చేసి భారీ ప్లాప్ నుండి తప్పించుకొని మంచి పని చేసాడు అల్లు అర్జున్. ఇంకా ఏ కొత్త చిత్రాన్ని కూడా అంగీకరించలేదు ఈ హీరో .అరవింద సమేత హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు అల్లు అర్జున్. ఎందుకంటే త్రివిక్రమ్ తో జత కట్టాలని చూస్తున్నాడు అల్లు అర్జున్.
English Title: Allu arjun great escape from NOTA
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2pC2qZ1
Comments
Post a Comment