పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలై ఘోర పరాజయం పొందింది. ఆ సినిమాని కొన్న బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ . ఈ అక్టోబర్11న అరవింద సమేత విడుదల అవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ మీడియా ముందుకు వచ్చాడు. ఇక అజ్ఞాతవాసి పై స్పందించాడు కూడా.
అజ్ఞాతవాసి ప్లాప్ అయినంత మాత్రాన అరవింద సమేత చిత్రంపై ప్రెజర్ పడుతుందని భావించడం లేదని ,ఏ సినిమా స్థాయి ఆ సినిమాదే అని నాకు కూడా వరుస ప్లాప్ లున్న విషయం అందరికి తెలిసిందే. కాబట్టి అజ్ఞాతవాసి ప్లాప్ అయితే ఇది కూడా ప్లాప్ అవుతుందని ఎలా అనుకుంటామని అన్నాడు ఎన్టీఆర్. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే , ఈషా రెబ్బా నటించగా జగపతిబాబు, నాగబాబు , సునీల్ లు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ తర్వాత త్రివిక్రమ్ నుండి వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా త్రివిక్రమ్ పై ఒత్తిడి ఉంటుంది. మరి ఆ ఒత్తిడిని త్రివిక్రమ్ అధిగమించి హిట్ కొడతాడా ? ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ ఇస్తాడా ? చూడాలి.
English Title: Ntr comments on pawan kalyan’s agnathavasi
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BZI2Iy
Comments
Post a Comment