యంగ్ టైగర్ ఎన్టీఆర్ నూనూగు మీసాల వయసులోనే ఆది , సింహాద్రి వంటి చిత్రాలతో చరిత్ర సృష్టించాడు , తిరుగులేని స్టార్ డం ని అందుకున్నాడు అయితే అదంతా ఒకప్పటి చరిత్ర ఇపుడు అదంతా గతం ఎందుకంటే ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్ లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు . పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు లాంటి హీరోలు ఎప్పుడో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయారు , ఎన్టీఆర్ కంటే వెనుక ఉన్న చరణ్ కూడా రంగస్థలం చిత్రంతో వంద కోట్లకు పైగా షేర్ సాధించిన హీరో అయ్యాడు. దాదాపు 9 ఏళ్ళ క్రితమే మగధీర తో ప్రభంజనం సృష్టించాడు . అలాగే ప్రభాస్ బాహుబలి , బాహుబలి2 చిత్రాలతో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు ఇక ఈమద్యే స్టార్ లీగ్ లో చేరిన విజయ్ దేవరకొండ సైతం భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నాడు .
వీళ్ళందరిని పక్కన పెడితే ఎన్టీఆర్ సాలిడ్ హిట్ కొట్టాలి అందునా వంద కోట్ల షేర్ సాధించాలి. అది ఇప్పటికి కూడా బాకీ గానే మిగిలి ఉంది. అది అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో సాధిస్తాడా ? ఆ అరుదైన ఫీట్ ని సాధించే అద్భుత అవకాశం ఇప్పుడు ఎన్టీఆర్ కు వచ్చింది. అక్టోబర్11న అరవింద్ సమేత చిత్రం విడుదల అవుతుండగా దసరా పండగ సందర్భంగా పది రోజులపైనే సెలవులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అంటే ఎన్టీఆర్ కు బ్రహ్మాండమైన అవకాశం అన్నమాట . పది రోజుల సెలవులు ఉన్నాయి కాబట్టి సినిమా బాగుంటే మొదటి వారంలోనే వంద కోట్లకు పైగా గ్రాస్ ని సాధించే ఛాన్స్ ఉంది. జోరు బాగుంటే తప్పకుండా పది రోజుల్లోనే వంద కోట్ల షేర్ రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు పైగా ఎన్టీఆర్ మాస్ హీరో కాబట్టి భారీ ఓపెనింగ్స్ ఉంటాయి కూడా.
English Title: Will ntr joins 100 crore club
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2E8Acim
Comments
Post a Comment