ఆంధ్రప్రదేశ్ కు అండగా ఉంటానని ట్వీట్ చేస్తూ ముఖ్యమంత్రి సహాయనిధికి 5 లక్షల విరాళం అందించాడు హీరో విజయ్ దేవరకొండ దాంతో అతడి పై ప్రశంసల వర్షం కురుస్తోంది . ఇక శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు అయితే విజయ్ దేవరకొండని పొగడ్తలతో ముంచెత్తాడు . కష్టకాలంలో శ్రీకాకుళం కు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ కు శ్రీకాకుళం జిల్లా యావత్తు కృతఙ్ఞతలు తెలియజేస్తోందని ,మీరు చూపించిన ఔదార్యానికి మీ వెన్నెంటే ఉంటుంది మా జిల్లా అంటూ ట్వీట్ చేసాడు యువ రాజకీయ నాయకుడు రామ్మోహన్ నాయుడు .విజయ్ దేవరకొండతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , వరుణ్ తేజ్ , సంపూర్నేష్ బాబు , అనిల్ రావిపూడి లను ప్రశంసలతో ముంచెత్తాడు రామ్మోహన్ నాయుడు . తిత్లి తుఫాన్ భీభత్సం సృష్టించగా ఆంద్రప్రదేశ్ లోని శ్రీకాకుళం , విజయనగరం జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి . దాంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి కి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి . తుఫాన్ ధాటికి నష్టపోయిన వాళ్ళను స్వయంగా కలిసి దుప్పట్లు , బిస్కెట్లు , మంచి నీరు తదితర సామాగ్రి ఇచ్చాడు హీరో నిఖిల్ అండ్ కో .
English Title: TDP MP rammohan praises Vijay Devarakonda
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2IZGBv9
Comments
Post a Comment