బాలీవుడ్ చిత్రాల్లో తండ్రి పాత్రలకు పెట్టింది పేరు అలోక్ నాద్ . అయితే ఆ అలోక్ నాద్ నన్ను రేప్ చేసాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది రచయిత్రి , నిర్మాత అయిన వింటా నందా . అలోక్ నాద్ అప్పట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ దాంతో అతడు రేప్ చేసినప్పటికీ భయపడి ఊరుకుందట ! ఇక రేప్ ఎప్పుడు జరిగిందో తెలుసా ……. 19 సంవత్సరాల క్రితం , ఇప్పుడు జరిగిన సంఘటన కాదు . 19 సంవత్సరాల క్రితం రేప్ జరిగితే ఇన్నాళ్ళ పాటు మౌనంగా ఉండి ఇప్పుడే ఎందుకు నోరు విప్పిందో తెలుసా …… తాజాగా తనుశ్రీ దత్తా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి వార్తల్లోకి ఎక్కడమే !
గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ సైలెంట్ గా ఉండేవాల్లని , భయటకు చెబితే పరువు పోతుందని అనుకునేవాల్లని కానీ కాలం మారిందని అందుకే బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని అంటున్నారు . అలోక్ నాద్ పై ఆరోపణలు రావడంతో అతడిపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో వివరణ ఇవ్వాల్సిందిగా బాలీవుడ్ నటీనటుల సంఘం నోటీసులు ఇచ్చిందట ! ఆ నోటీసులకు అలోక్ నాద్ ఎలా స్పందిస్తాడో చూడాలి .
English Title: Actor Alok nath raped me says vinta nanda
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OS27Yo
Comments
Post a Comment