ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని పోలిన మనిషి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . అచ్చం చంద్రబాబు నాయుడి లా ఉన్న మనిషి ఓ చిన్న కాకా హోటల్ లో సర్వర్ గా పనిచేస్తున్నాడు . పొడుగు , గడ్డం , ముఖ పోలికలు అచ్చు గుద్దినట్టుగా చంద్రబాబుని పోలి ఉన్నాడు ఆ వ్యక్తి . మనుషులను పోలిన మనుషులు బోలెడు మంది ఉంటారు ఈ ప్రపంచంలో అయితే కాస్త పోలికల్లో తేడా ఉంటుంది కానీ ఈ వ్యక్తి మాత్రం అచ్చుగుద్దినట్లుగా బాబు ని పోలి ఉన్నాడు . అయితే అతడు సాధారణ వ్యక్తి , ఓ చిన్న హోటల్ లో పనులు నిర్వహిస్తున్నాడు . అచ్చం బాబులా పోలి ఉండటంతో అతడ్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు . ఇంకేముంది అది వైరల్ అవుతోంది .
చంద్రబాబుని మాత్రమే కాదు ఇతర నాయకుల పోలికలు ఉన్నవాళ్లు కూడా చాలామంది ఉన్నారు . ఎన్టీఆర్ , కేసీఆర్ , మోడీ , లాలూ ప్రసాద్ యాదవ్ , ట్రంప్ , నవాజ్ షరీఫ్ , ఇమ్రాన్ ఖాన్ , ఇలా చెప్పుకుంటూ పొతే ప్రపంచ వ్యాప్తంగా చాలామంది నాయకులను పోలిన వాళ్ళున్నారు అలాగే ఇతర మనుషులను, రాజకీయ నాయకులను పోలిన వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు . రాజకీయ నాయకులను పోలిన వాళ్లతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు రాజకీయ పార్టీల నాయకులు .
English Title: Shocking :chandrababu naidu serving in small hotel
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CIgVmz
Comments
Post a Comment