యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 11 న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ -త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎన్టీఆర్ గతకొంత కాలంగా వరుస విజయాలు అందుకుంటున్నాడు . అయితే త్రివిక్రమ్ మాత్రం పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి చిత్రంతో డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు . దాంతో త్రివిక్రమ్ తప్పనిసరిగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే ఈ అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో.
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే తమన్ అందించిన పాటలకు క్రేజ్ పెద్దగా రాలేదు ఎందుకంటే అరవింద సమేత పాటలు ఎక్కడో వున్నట్లుగా ఉండటం కూడా కొంత వరకు మైనస్ అనే చెప్పాలి ,కానీ విజువల్ గా అరవింద సమేత బాగుంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే , ఈషా రెబ్బా నటిస్తుండగా సునీల్ , జగపతి బాబు , నాగబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా పది రోజుల పైనే సెలవులు ఇస్తున్నారు ,దాంతో అరవింద సమేత వీర లెవల్లో కుమ్మేయడం ఖాయమని ధీమాగా ఉన్నారు. మరి సెలవులను సద్వినియోగం చేసుకొని బ్లాక్ బస్టర్ కొడతారా ? రికార్డుల మోత మోగిస్తారా ? చూద్దాం . ఏం జరుగుతుందో ……
English Title: Will ntr and trivikram get succes with aravinda sametha ?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zKlgTE
Comments
Post a Comment