తమ అభిమాన హీరో వస్తున్నాడు కదా ! దగ్గరగా చూద్దామని వెళ్లిన అభిమానులను కాలితో తన్నాడు నందమూరి బాలకృష్ణ. దాంతో షాక్ కి గురైన అభిమానులు బాలయ్య వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలయ్య ఫ్లెక్సీలను , తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. అంతేకాదు బాలయ్య మాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో జరిగింది. తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేయడానికి వచ్చిన బాలయ్యకు ఘనస్వాగతం పలికారు బాలయ్య అభిమానులు , తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇక బాలయ్య ని చూడటానికి పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చారు.
అయితే కొంతమంది బాలయ్య అభిమానులు బాలయ్య వాహనం ముందు నిల్చొని కదలకుండా ఉండటంతో బాలయ్య ఆగ్రహంతో ఊగిపోయాడు అంతే వాహనం దిగి లాలూ , రమేష్ , కృష్ణయ్య అనే ముగ్గుర్ని కాలితో తన్నాడు బాలయ్య. వందలాది ప్రజల సమక్షంలో కొట్టడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక దెబ్బలు తిన్న వాళ్ళ అహం పూర్తిగా దెబ్బతింది అందుకే పట్టరాని ఆవేశంతో బాలయ్య ఫ్లెక్సీలను కాల్చి పడేసారు. అంతేకాదు బాలయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా బాలయ్య పలుమార్లు పలు సందర్భాల్లో అభిమానులపై చేయి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు.
English Title: Balayya fans angry on balakrishna
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NgadFl
Comments
Post a Comment