యాంకర్ రష్మి నువ్ లావు అవుతున్నావ్ ? అంటూ ఓ నెటిజన్ రష్మి ని కామెంట్ చేయడంతో ఈ హాట్ భామకు విపరీతమైన కోపం వచ్చింది అంతే అతడికి ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది . నేను యాంకర్ గా చేస్తున్నాను , ప్రతీరోజు షూట్ ఉంటుంది కాబట్టి నేను రోజు ఎక్సర్ సైజ్ చేయలేను అయినా నేనేమైనా హీరోయిన్ నా ? ప్రతీరోజు జిమ్ కెళ్ళి నా బాడీ ని కంట్రోల్ లో పెట్టుకోవడానికి అంటూ సీరియస్ గా ప్రశ్నించింది యాంకర్ రష్మి . ఈ భామ పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఒక్క గుంటూరు టాకీస్ చిత్రం మాత్రమే హిట్ అయ్యింది దాంతో వరుసపెట్టి రొమాంటిక్ సినిమాలు చేసింది , అంగాంగ ప్రదర్శన చేసింది కానీ ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి .
అయితే సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ యాంకర్ గా మాత్రం సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తోంది . జబర్దస్త్ తో పాటుగా పలు షోలకు యాంకర్ గా చేస్తోంది . సుడిగాలి సుధీర్ తో ఎక్కువ క్లోజ్ గా మూవ్ అవుతుండటంతో ఈ ఇద్దరి మద్య ఏదో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే మా మద్య ఏమి లేదు అని రొటీన్ డైలాగ్ అయితే చెబుతూనే ఉంది రష్మి . బుల్లితెరపై అందాలను ఆరబోస్తూ సక్సెస్ అయిన రష్మి వెండితెర మీద మాత్రం సక్సెస్ కాలేకపోయింది .
English Title: anchor rashmi fires on netizen
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2yNuOvl
Comments
Post a Comment