
ఈ చిత్రానికి సంబంధించిన ‘లవ్ అంటే నేనేలే’ సాంగ్ ను సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. పాట కు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగున్నాయి.
తమ చిత్రంలోని పాటను జీనియస్ దర్శకుడు మణిరత్నం విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు.ఈ గీతాన్ని మలేషియాలోని పలు సుందరమైన లొకేషన్ లలో చిత్రీకరణ జరుపుకుంది. ఈ గీతాన్ని శ్రీమణి రచించగా, దేవన్ ఆలపించారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.
ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ
నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QAzxYu
Comments
Post a Comment