విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ కు యువతలో విపరీతమైన క్రేజ్ ఏర్పడటంతో తొలిరోజు భారీ వసూళ్లు వచ్చాయి. ఇంతకీ మొదటి రోజున నోటా ఎంత వసూల్ చేసిందో తెలుసా……. 14 కోట్లు అవును అక్షరాల పద్నాలుగు కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ నోటా సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో 7 కోట్లు వసూల్ చేసి దేవరకొండ సత్తా చాటింది. ఇక అమెరికాలో కూడా 1. 85 కోట్లు సాధించడం విశేషం. కర్ణాటకలో 1.55 కోట్లు , తమిళనాడు లో 2.66 , రెస్ట్ ఆఫ్ ఇండియా లో మరో 2 కోట్ల గ్రాస్ వసూళ్లు మొత్తం కలిపి 14 కోట్ల గ్రాస్ వసూల్ అయ్యింది మొదటి రోజున.
అయితే నోటా చిత్రానికి డివైడ్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. మంచి కథ ఎంచుకున్నప్పటికి కథనం పూర్తిగా ఆసక్తికరంగా లేకపోవడంతో నోటా కు ప్లాప్ టాక్ వచ్చింది అయితే విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ వల్ల మొదటి రోజు బాగానే వసూళ్లు వచ్చాయి. ఈరోజు , రేపు కూడా వీకెండ్ కాబట్టి ఈ రెండు రోజుల పాటు కూడా బాగానే వస్తాయి . ఇక సోమవారం నుండి కలెక్షన్స్ పడిపోనున్నాయి. నిర్మాతలకు బాగానే లాభాలు వచ్చాయి కానీ బయ్యర్లకు మాత్రమే నష్టాలు వచ్చేలా ఉన్నాయి నోటా చిత్రానికి. యువ ముఖ్యమంత్రి గా విజయ్ దేవరకొండ బాగానే నటించినప్పటికీ డైరెక్షన్ లోపం కారణంతో నోటా ప్లాప్ అయ్యింది. గీత గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్ కి నోటా పెద్ద స్పీడ్ బ్రేకర్ అయ్యింది.
English Title: Vijay devarakonda’s NOTA first day collections
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QvWVGw
Comments
Post a Comment