బెడ్ రూమ్ లోకి రా ….. అక్కడ గమ్మత్తుగా ఉంటుంది , మొత్తం కథ ఎలా ఉంటుందో , ఎలాంటి మలుపులు తిరుగుతుందో అక్కడ వివరంగా చెబుతానని అన్నాడట బాలీవుడ్ డైరెక్టర్ విపుల్ షా , అతడి మాటలతో షాక్ అయ్యానని అందుకే చాలాకాలం ఈ దేశం విడిచి వెళ్ళిపోయానని సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ ఎల్నాజ్ నౌరోజీ . సాక్రేడ్ గేమ్స్ అనే వెబ్ సిరీస్ లో నటించి సంచలనం సృష్టించిన భామ ఎల్నాజ్ నౌరోజీ . కాగా తెరమీద రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తున్న ఈ భామ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడట బాలీవుడ్ డైరెక్టర్ విపుల్ . నమస్తే ఇంగ్లాండ్ అనే సినిమా ఆడిషన్స్ కోసం నౌరోజీ విపుల్ ని కలిసిందట , అయితే ఆమె కలిసిన సమయంలోనే గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టాడట దాంతో షాక్ అయ్యిందట సరే ….. అని సర్డుచేప్పుకొని అక్కడే ఉండేసరికి మౌనం అర్దాంగికారం అనుకోని బెడ్ రూమ్ లోకి రా ….. వస్తే అక్కడ కథ మొత్తం చెబుతానని అన్నాడట ! దాంతో అక్కడి నుండి వెళ్ళిపోయానని అంటోంది .
ప్రస్తుతం మీటూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ,పలువురు హీరోయిన్ లు , సినిమారంగంలోని ఇతర మహిళలు మీటూ అంటూ తమకు జరిగిన అనుభవాలను పంచుకుంటున్నారు . ఆ క్రమంలోనే ఎల్నాజ్ నౌరోజీ బాలీవుడ్ డైరెక్టర్ విపుల్ షా పై లైంగిక ఆరోపణలు చేస్తోంది . ఏది ఏమైనా భారత్ మాత్రం మీ టూ ప్రకంపనలతో అట్టుడికి పోతోంది . నౌరోజీ ఆరోపణలపై విపుల్ షా ఎలా స్పందిస్తాడో చూడాలి .
English Title: Elnaz norouzi sensational comments on bollywood director
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2R1uUHe
Comments
Post a Comment