Skip to main content

‘ఘంటసాల ది గ్రేట్’ పేరుతో బయోపిక్

Ghantasala the Great biopic first lookఈ రోజుల్లో బయోపిక్స్ అనేవి ఇండియన్ సినిమాకు కొత్త ట్రెండ్. నెమ్మదిగా ఇవి ప్రేక్షకుల అభిరుచిని మార్చేస్తున్నాయనిపిస్తుంది. నిజ జీవిత పాత్రలతో వస్తున్న సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి అన్నది నిస్సందేహం. ఒక సామాన్యుడు ఒక లక్ష్యం ఏర్పరుచుకొని అది సాధించడం కోసం పడిన కష్టం, ఎదుర్కొన్న ఆటుపోట్లు, జీవనశైలికి కొంత నాటకీయత జోడిస్తూ చూపిస్తున్న తీరుకు ప్రేక్షకుడు ఆకర్షితుడవుతున్నాడని చెప్పడానికి ఈ మధ్య వస్తున్న బయోపిక్సే నిదర్శనం. బయోపిక్ లో పెద్ద ఉపయోగం ఏమిటంటే ప్రేక్షకుడికి ఇవి ఇట్టే “కనెక్ట్” అయిపోతాయి. అటువంటి జీవిత కథల్లో – లోతైన కథ, మంచి పట్టున్న దృశ్యాలు, వీనుల విందైన సంగీతం ఉన్నట్లయితే అవి తప్పకుండా ప్రేక్షకున్ని కట్టిపడేయడం ఖాయం.

ఇంత వరకు మనం చరిత్రకారుల, క్రీడాకారుల, నటీనటుల జీవిత చిత్రాలను చూశాము. మొన్నటి “దంగల్” నిన్నటి “మహానటి” ఎంత ఘన విజయం సాధించాయో తెలియంది కాదు. దక్షిణ భారతదేశంలో మహానటి అంటే సావిత్రి, మహాగాయకుడు అంటే ఘంటసాల అని భారతదేశం అంతా తెలుసు. అయన జీవితం ఆధారంగా ఇప్పుడు “ ఘంటసాల” సినిమా వచ్చేస్తుంది.

ఘంటసాల అంటే పాట, పాట అంటే ఘంటసాల అని అందరికీ తెలుసు. కాని, అయన ఒక వ్యక్తిగా ఎంత గొప్పవాడో కొందరికే తెలుసు. అది అందరికి తెలియచేసేదే ఈ చిత్రం. అయన జీవితం పూల బాట కాదని, ముళ్ళ బాటలో నడిచి, మనకి పూల ‘పాట’లందించాడని చెప్పేదే ఈ చిత్రం. పాట కోసం ఎన్ని కష్టాలు పడినా, పట్టిన పట్టు విడవక విజయం సాదించి, “కృషితో నాస్తి దుర్భిక్షం” అని నిరూపించాడు. వినయంతోనే విద్య ప్రకాశిస్తుంది అనడానికి అయన జీవితమే నిదర్శనం.

అయన పాడిన పాటలకు అయన జీవితానికి ఎంత దగ్గర సంబంధం వుందో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. అయన జీవితం ఎన్నో ఎత్తు పల్లాలకు లోని నడిచి, చివరికి డ్రమెటిక్ గా ముగియడం విశేషం.

అన్యుక్తరం ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి లక్శ్మీ నీరజ నిర్మాతగా, గాయకుడూ G.V. భాస్కర్ నిర్మాణ సారధ్యం లో వస్తున్న ఈ చిత్రానికి – పాటల పుస్తకాల కేటగిరిలో అత్యధికంగా అమ్ముడుబోయిన “ఘంటసాల ‘పాట’ శాల” సంకలన కర్త సి. హెచ్ రామారావు రచన – దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రీ రికార్డింగ్ ముగించుకొని ఈ సంవత్సరం డిసెంబర్ లో విడుదలకు సిద్దమవుతుంది. బాహుబలి కెమెరామెన్ సెంథిల్ కుమార్ శిష్యుడు వేణు వాదనల ఈ చిత్రానికి కెమెరామెన్ గాను, ఇటీ వలే విడుదలైన “అంతకుమించి” చిత్రానికి పనిచేసిన క్రాంతి (RK) ఎడిటర్ గాను, ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వర రావు గారి కుమారుడు, సంగీత లోకానికి చిరపరిచితులు అయిన సాలూరి వాసూరావు గారు సంగీత దర్శకులుగా పనిచేస్తున్నారు.

ఇకపోతే మహా గాయకుడు “ఘంటసాల” గా వర్ధమాన గాయకుడూ, ‘సూపర్ సింగర్స్ 7’ తో చిరపరిచితుడైన కృష్ణ చైతన్య పోషిస్తున్నారు. ఘంటసాల సతీమణి ‘సావిత్రి’ గా కృష్ణ చైతన్య సతీమణి ప్రముఖ యాంకర్ మృదుల పోషించగా, ఘంటసాల గురువుగా పట్రాయని సీతారామ శాస్త్రిగా సుబ్బరాయశర్మ చేస్తున్నారు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని శనివారం హైదరాబాద్ లో ప్రముఖ దర్శకులు కె . రాఘవేంద్ర రావు ఆవిష్కరించారు .

అక్టోబర్ లో ఈ చిత్రానికి సంబంధించిన ‘టీజర్’ సినిమా దిగ్గజాల సమక్షంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి .



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PfBr0p

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...