అనూహ్యమైన క్రేజ్ ని తక్కువ సమయంలోనే పొందిన హీరో విజయ్ దేవరకొండ సొంత కంపెనీ స్టార్ట్ చేసి సంచలనం సృష్టించాడు. నిన్న సాయంత్రం జరిగిన నోటా పబ్లిక్ మీటింగ్ లో తన సొంత ప్రొడక్షన్ హౌజ్ లోగో ఆవిష్కరించాడు విజయ్ దేవరకొండ. ఇంతకీ ఈ క్రేజీ హీరో ప్రొడక్షన్ హౌజ్ పేరేంటో తెలుసా ……. కింగ్ ఆఫ్ ది హిల్ . రాజు కిరీటంని లోగోగా మలిచాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో విజయ్ కి ఎనలేని క్రేజ్ వచ్చేసింది . తాజాగా నోటా చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం అవుతున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన నోటా చిత్రం ఈనెల 5న విడుదల కానుంది. దాంతో నోటా పబ్లిక్ మీటింగ్ పెట్టారు నిన్న .
ముఖ్యమంత్రి పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ ఎలా ఆకట్టుకుంటాడో మరో మూడు రోజుల్లో తేలిపోనుంది. అయితే వరుస విజయాలతో విపరీతమైన క్రేజ్ రావడంతో దాన్ని సొమ్ము చేసుకోవడానికి సొంత కంపెనీ స్టార్ట్ చేసాడు విజయ్ దేవరకొండ. క్రేజ్ ఎలాగూ ఉంది కాబట్టి దాన్ని బయటి నిర్మాతలకు కట్టబెట్టే కంటే సొమ్ము చేసుకుంటేనే బెటర్ అని అనుకున్నట్లున్నాడు ఈ హీరో. లోగో అయితే లాంచ్ చేసాడు కానీ పూర్తి వివరాలు మాత్రం చెప్పలేదు.
English Title: Vijay devarakonda starts own production house
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Iydlva
Comments
Post a Comment