విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం నోటా ఈరోజు భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడులో అలాగే ఓవర్ సీస్ లో కూడా పెద్ద ఎత్తున విడుదల చేసారు. ఇక అమెరికాలో అప్పుడే షోలు పడ్డాయి టాక్ కూడా బయటకు వచ్చేసింది. ఇంతకీ అమెరికాలోని వాళ్ళు నోటా చిత్రాన్ని చూసి ఏమంటున్నారో తెలుసా …… నోటా ప్లాప్ అని. నోటా చిత్రం ఏ స్థాయిలో కూడా ప్రేక్షకులను అలరించేలా లేదని పెదవి విరుస్తున్నారు.
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎక్కువగా తమిళ నేటివిటి ఎక్కువగా ఉండటం కూడా ఈ సినిమాకు మైనస్ గా మారిందని పోనీ తమిళ నేటివిటి ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే పరంగా అయినా మేజిక్ పనిచేస్తే బాగుండేదని అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు. గీత గోవిందం తో ప్రభంజనం సృష్టించిన విజయ్ దేవరకొండ నోటా తో దెబ్బతిన్నాడని అంటున్నారు. విజయ్ దేవరకొండ తన పాత్ర కు న్యాయం చేసినప్పటికీ సినిమా అనుకున్న స్థాయిలో , ఆశించిన స్థాయిలో లేదని నిరుత్సాహం తో చెబుతున్నారు. అయితే కొంతమంది కి మాత్రమే నోటా నచ్చింది వాళ్ళు మాత్రం ఫరావలేదని అంటున్నారు. ఏది ఏమైనా నోటా మాత్రం డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు.
English Title: Flop talk to vijay devarakonda’s NOTA
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2y3xHbI
Comments
Post a Comment