
హీరో టర్నడ్ ప్రొడ్యూసర్ నిశ్చల్ దేవా మాట్లాడుతూ.. ‘లైఫ్ స్టైల్, తులసిదళం’ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన నేను.. కథ నచ్చడంతో ఈ సినిమాతో నిర్మాతగా మారాను. దర్శకుడు ఎం.వి.ప్రసాద్ ప్రాణం పెట్టి ఈ సినిమా తీశారు. సినిమా మొత్తం లండన్ లో తీశాం.. అన్నారు.
హీరోయిన్ కరిష్మా కర్పాల్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా క్యారక్టర్ ని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసారు డైరెక్టర్’ అన్నారు.
దర్శకుడు ఎం.వి.ప్రసాద్ మాట్లాడుతూ.. ‘జ్వరం, జలుబు వంటి వ్యాధులు వచ్చినప్పుడు ఎలా అయితే మందులు వేసుకుని.. ఆ వ్యాధులు నయం చేసుకుంటామో.. క్యాన్సర్ సోకినప్పుడు కూడా అంతే సులభంగా నయం చేసుకునేలా ఉండాలనే లక్ష్యంతో పని చేసే ప్రేమికులకు ఎదురయ్యే కొన్ని అనూహ్య సంఘటనల సమాహారంగా ‘మనసా.. వాచా’ చిత్రాన్ని రూపొందించాం. రీసెర్చ్ స్కాలర్స్ గా తేజస్, కరిష్మా చాలా బాగా నటించారు. దర్శకుడిగా పరిచయమవుతున్న నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు.
ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ఎం.జి.ఎం అధినేత అచ్చిబాబు మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత మంచి సినిమా మా ఎం.జి.ఎం ద్వారా విడుదలవుతుండడం సంతోషంగా ఉంది. మార్చ్ 1న వీలైనన్ని ఎక్కువ ధియేటర్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు!!
English Title: Manasa Vacha movie to release on 1st March
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2IcFYBT

Comments
Post a Comment