Skip to main content

విన‌రా సోద‌రా వీర‌కుమార ట్రైల‌ర్ లాంచ్‌

Vinara Sodhara Veera kumara movie trailer launchedల‌క్ష్మీస్ సినీ విజ‌న్స్ బ్యాన‌ర్ పై ల‌క్ష్మ‌ణ్ క్యాదారి నిర్మాణంలో స‌తీష్‌చంద్ర నాదెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం విన‌రా సోద‌రా వీర‌కుమార‌. శ్రీ‌నివాస్‌సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ  చిత్ర షూటింగ్ ప‌నుల‌న్నీ పూర్తి చేసుకుని మంగ‌ళ‌వారం ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో చిత్ర ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ చేతుల మీద‌గా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో…

 

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ… ఈ చిత్ర యూనిట్ అంద‌రికీ ట్రైల‌ర్ లాంచ్ అయిన సంద‌ర్భంగా ముందుగా కృత‌జ్ఞ‌త‌లు.నేను ఒక నెల క్రితమే ఈ ట్రైల‌ర్  ను చూశాను. చాలా బావుంది ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. నాకు స‌తీష్‌ని ల‌క్ష్మ‌ణ్ ప‌రిచ‌యం చేశాడు. స‌తీష్ క‌థ చెప్ప‌డంతో విమ‌ర్శ‌కుల‌తో కూడా ప్ర‌శంస‌లు అందుకునే క‌థ ఇది అని అన్నాను. ప్ర‌స్తుతం ఉన్న చిత్రాల‌తో పోటీ ప‌డే క‌థ త‌ప్ప‌కుండా చెయ్య‌మ‌న్నాను. ఈ చిత్ర షూటింగ్ మొత్తం కాకినాడ‌లో జ‌రిగింది. యూనిట్ మొత్తం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఎన్నో ఎమోష‌న్స్ ఉన్న చిత్ర‌మిది. డిఫ‌రెంట్ స్టోరీ ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఆద‌రిస్తారు.ఈ ట్రైల‌ర్ యూత్‌లో మంచి ట్రెండింగ్ కావాల‌ని కోరుకుంటున్నాను.

 

ఉత్తేజ్ మాట్లాడుతూ… స‌తీష్ సినిమాని విప‌రీతంగా ప్రేమించే మనిషి. ఈ చిత్రంలోని మాట‌లు పాట‌లు కూడా చాలా బావుంటాయి ఎన్నో చిత్రాల‌కు మాట‌లు రాసిన భూప‌తి ఈ చిత్రానికి రాశారు.  పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ చూడాల్సిన చిత్ర‌మిది. ఈ సినిమాలో హీరో కూడా చాలా బాగా చేశారు. త‌ను ఈ ట్రైల‌ర్ లాంచ్ కి రాక‌పోవ‌డానికి కార‌ణం త‌ను వేరే సినిమా షూటింగ్‌లో ఉన్న‌డు. ఈ సినిమాలో నాది చాలా మంచి క్యారెక్ట‌ర్ మొద‌టిసారి హీరో ఫాద‌ర్ క్యారెక్ట‌ర్‌లో చేస్తున్నాను.

 

ల‌క్ష్మీభూప‌తి మాట్లాడుతూ… ఇన్నాళ్లు ఎన్నో క‌థ‌లు విన్నాను, మొట్ట మొద‌టిసారి బాగా నాకు న‌చ్చిన క‌థ ఇది. అద్భుత‌మైన తెలుగు ప్రొడ్యూస‌ర్‌, తెలుగు మ‌నుషులు చేశారు. నాకు అది న‌చ్చి క‌థ‌కి ఇన్స్పైర్ అయ్యి ఈ చిత్రాన్నిచేశాను. ఉత్తేజ్ అన్న‌య్య కొన్ని కొన్ని ఎమోష‌న్స్‌ని చాలా బాగా పండించారు. హీరో కూడా చాలా బాగా చేశారు. ఈ చిత్ర యూనిట్ అంద‌రికీ నా కృతజ్ఞ‌త‌లు ప్రొడ్యూస‌ర్‌కి మంచిగా డబ్బులు రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

 

డి.ఓ.పి మాట్లాడుతూ… నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు చిత్ర యూనిట్‌కి కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

 

హీరోయిన్ ప్రియాంక జైన్ మాట్లాడుతూ… ముందుగా నేను తెలుగు ఇండ‌స్ట్రీకి  నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. ఈ సినిమా టైటిల్ విన‌డానికి చాలా పాత‌కాలం లాగా ఉంటుంది. కాని చాలా మోడ్ర‌న్ స్టోరీ ఇది. స‌తీష్‌గారి స‌పోర్ట్ వ‌ల్ల నేను అంత బాగా చెయ్య‌గ‌లిగాను. ఈ చిత్రానికి క‌థే మెయిన్ బ్యాక్‌బోన్ అని అన్నారు.

 

ప్రొడ్యూస‌ర్ మాట్లాడ‌తూ… మా సినిమాని అంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

 

డైరెక్ట‌ర్ స‌తీష్ మాట్లాడుతూ… ఇది చాలా జెన్యూన్ గా రాసిన క‌థ‌. డైరెక్ట‌ర్ అవ్వాల‌ని ఎన్నో సంవ‌త్స‌రాలుగా ట్రై చేస్తున్నాను. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన ల‌క్ష్మ‌ణ్‌గారికి నా కృతజ్ఞ‌త‌లు. కొత్త కాన్సెప్ట్‌తో రావాల‌ని క‌థ‌మీద సంవ‌త్స‌రం పాటు ప‌ని చేశాను. అంద‌ర్నీ కొత్త‌వాళ్ళ‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ చిత్రం షూటింగ్ మొత్తం కాకినాడ‌లో సింగిల్ షెడ్యూల్‌లో 50రోజుల పాటు చేశాము. అంద‌రూ చాలా బాగా కోప‌రేట్ చేశారు. ల‌క్ష్మ‌ణ్‌గారు ఇప్ప‌టికే మూడు సినిమాలు తీశారు. మూడు సినిమాల్లో ముగ్గురు కొత్త డైరెక్ట‌ర్లే ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు.

 

చైల్డ్ ఆర్టిస్ట్ రోష‌న్ మాట్లాడుతూ… న‌న్ను న‌మ్మినాకు ఇంత మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చినందుకు అంద‌రికీ పేరు పేరునా నా కృత‌జ్ఞ‌త‌లు. ఆల్ ద బెస్ట్ అన్నారు.

 

న‌టీన‌టులుః

 

శ్రీ‌నివాస్‌సాయి, ప్రియాక‌జైన్‌, ఉత్తేజ్‌, ఝాన్సీ, జెమిని సురేష్‌, ర‌విరాజ్‌, ప‌వ‌న్‌ర‌మేష్‌, స‌న్ని, రోష‌న్‌, జైబోలో చంటి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ఃల‌క్ష్మీభూపాల‌, సంగీతంః శ్ర‌వ‌ణ్‌భ‌ర‌ద్వాజ్‌, కెమెరాఃర‌వి.వి, డాన్స్ఃఅజ‌య్‌సాయి, స్టంట్స్ఃరాబిన్‌సుబ్బు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ఃఅనిల్ మైలాపుర్ ప్రొడ్యూస‌ర్ఃల‌క్ష్మ‌ణ్‌క్యాదారి, డైరెక్ట‌ర్ఃస‌తీష్ చంద్ర‌నాదెళ్ళ‌.

 

English Title: Vinara Sodhara Veera kumara movie trailer launched

35 Lakhs Fine to Mahesh babu AMBKani Kusruti faced sexual harrasmentSri Reddy: Koratala Siva is the boss of KamasutraMalika Arora revealed her divorce



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TnhASa

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...