Skip to main content

‘ఐఐటీ కృష్ణమూర్తి ‘ టీజర్ విడుదల..

IIT Krishnamurthy Teaser Releasedపృద్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి ‘. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  నూతన దర్శకుడు శ్రీ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ్ కుమార్ పాత్ర సమర్పిస్తున్న ఈ సినిమా ని క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్నారు..  వినూత్నమైన కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను  కె.ఎస్ రామారావు, విడుదల చేశారు.

 

కె.ఎస్‌ రామారావు మాట్లాడుతూ.. చిత్ర దర్శకుడు శ్రీ  వర్ధన్  చాలా మంచి వ్యక్తి. టాలెంటెడ్. టీజర్ చూస్తే నే అర్థమవుతుంది .  టిజర్  లో ఏదో వుంది . హీరో హీరోయిన్ బాగున్నారు. టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానన్నారు.

రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. ‘ఐఐటి కృష్ణమూర్తి’ టైటిల్ వెరైటీ గా టీజర్ ఇంటెన్స్ గా చాలా బాగుంది. మంచి  కాన్సెప్ట్ .‌ యూత్ అందరు కలిసి చెసిన ఈ సినిమా నిర్మాతకు సక్సెస్ ను అందించాలని ఆశిస్తున్నానన్నారు.

చిత్ర దర్శకుడు
శ్రీ వర్దన్ మాట్లాడుతూ.. విచ్చెసిన గెస్ట్ లకు ధన్యవాదాలు. నేటి తరానికి నచ్చెలా ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ను తీశాము. నిర్మాత సపోర్ట్ అప్పటికి  మరచిపోలేము . అందరికి మా “ఐఐటి కృష్ణమూర్తి” నచ్చుతాడని నమ్ముతున్నామన్నారు.

సంగీత దర్శకుడు నరేష్ కుమారన్  మాట్లాడుతూ.. ఇదోక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అందరు జెన్యూన్ గా  కష్టపడ్డామన్నారు.

చిత్ర సమర్పకులు ప్రేమ్ కుమార్ పాత్ర మాట్లాడుతూ..  ఈ చిత్ర నిర్మాత ప్రసాద్ నీకూరి  తొలిసారి అయినా విషయం ఉన్న  మంచి సినిమా చేశారు. ఈ టీమ్ కు సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను అన్నారు.

నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ..‌ సినిమా ఫీల్డ్ నాకు కొత్త. ఈ చిత్ర దర్శకుడు రైటర్ పట్టుదల ,కథ నచ్చి ఈ సినిమా చేశాం. ఈ కాన్సెప్ట్ యూనివర్సల్ . అది నచ్చి ప్రేమ్ కుమార్ సపోర్ట్ చేశారన్నారు.

హీరో పృధ్వీ దండమూడి మాట్లాడుతూ.. నేను హీరో అయినా, మా టీమ్ మెంబర్స్ ఈ చిత్రానికి రియల్ హీరోస్. నిర్మాత ప్రసాద్ గారు  అవగాహన లేకపోయినా  కథ పైన  తనకున్న  నమ్మకంతో  ఈ సినిమా చేశారు‌. అందరు కష్టపడి బెస్ట్ ఔట్పుట్ రావటానికి కృషి చేశాం.

ఇంకా ఈ కార్యక్రమంలో తుమ్మల పల్లి రామ సత్యనారాయణ,  సురేష్ కొండేటి, సాయి వెంకట్, రమేష్ మద్దినేని , బాబ్జీ ,రామ్ రావిపల్లి  తదితరులు పాల్గొన్నారు

పృద్వీ దండమూడి, మైరా దోషి,  వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి దర్శకుడు : శ్రీ వర్ధన్,

సమర్పణ : ప్రేమ్ కుమార్ పాత్ర

నిర్మాత :  ప్రసాద్ నేకూరి,

బ్యానర్ :  క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ , సినిమాటోగ్రఫీ: యేసు.పి,

సంగీతం: నరేష్ కుమారన్,

ఎడిటర్ : అనిల్ కుమార్.పి

రచన : నాగార్జున మనపాక,

గీత రచయిత : రామాంజనేయులు సంకర్పూ,

లైన్ ప్రొడ్యూసర్ : ఎల్.వి. వాసుకి,

పి.ఆర్.ఓ : సాయి సతీష్

 

English Title: IIT Krishnamurthy Teaser Released

35 Lakhs Fine to Mahesh babu AMBKani Kusruti faced sexual harrasmentSri Reddy: Koratala Siva is the boss of KamasutraMalika Arora revealed her divorce



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2IwzYUr

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...