Skip to main content

అక్రమ్ సురేష్ హీరో గా ఆర్.ఏ.ఎం మూవీ ‘అక్రమ్’ ఫస్ట్ లుక్ లాంచ్

akram movie first lookఅక్ర‌మ్ సురేష్ హీరోగా రాజధాని అమరావతి మూవీస్ బ్యానర్ లో భారీ మాస్ యాక్ష‌న్ మూవీ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఓ షెడ్యూల్, 2 పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. హాలీవుడ్ రేంజులో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది.  హీరో అక్ర‌మ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రాణా పాత్ర లుక్ ని సీనియ‌ర్‌ హీరో సుమ‌న్  లాంచ్ చేశాం. రామోజీ ఫిలింసిటీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో స‌మ‌ర్ప‌కుడు విస్సాకోటి, శివ‌కుమార్ ఇత‌ర టీమ్ పాల్గొన్నారు.

 

ద‌ర్శ‌కనిర్మాత‌లు మాట్లాడుతూ-“డాన్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రాక్, రాణా, అక్ర‌మ్‌, రాణా ప్ర‌తాప్ సింగ్ అనే నాలుగు గెట‌ప్పుల్లో హీరో న‌టిస్తాడు.నాలుగు స్టైలిష్ గెట‌ప్పుల‌తో ప్రేక్ష‌కుల్ని క‌థానాయ‌కుడు మంత్ర‌ముగ్ధం చేస్తాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్ .. చిన్నా పెద్దా అంద‌రికీ న‌చ్చే చిత్ర‌మిది. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ తుర్ల‌పాటి అక్కినేనికి న‌ట సామ్రాట్ బిరుదును ఇచ్చారు. తాజా చిత్రంలో అక్ర‌మ్ సురేష్ గెట‌ప్ చూసి టాలీవుడ్ త‌లైవా అనే బిరుదును ఇచ్చారు. భారీ సెట్ లో చిత్రీక‌రించిన ఇంట‌ర్వెల్ సీన్ హైలైట్. 40 సినిమాల అనుభ‌వ‌జ్ఞుడిగా హీరో న‌టించాడు. క‌థానుసారం అద్భుత‌మైన నిర్మాణ విలువ‌ల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇది మోస్ట్ స్టైలిష్ యాక్ష‌న్ సినిమా.. డాన్ ల సినిమాల్లోనే ప్ర‌త్యేకంగా నిలుస్తుంది. అత్యంత ఖ‌రీదైన కార్ల‌ను, దిగుమ‌తి చేసిన బైక్ ల‌ను ఉప‌యోగించారు. త్వ‌ర‌లో రాక్ లుక్‌ని, ఉగాదికి టీజ‌ర్ ని రిలీజ్ చేస్తాం“ అని అన్నారు.

పోసాని, సుమ‌న్, లిపికా త‌దిత‌రులు న‌టించారు. దిల్లీ భామ ఖుషీ క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. ఈ చిత్రానికి సంగీతం:ఎం.యు.సాయి, ఎడిటింగ్:  గౌతం రాజు, కెమెరా: అనీల్, క‌థ‌-క‌థ‌నం-డైలాగ్స్-ద‌ర్శ‌క‌త్వం:  సురేష్ మేడిది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2IFEvUJ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...