Skip to main content

పాజిటిట్ టాక్ తో దూసుకుపోతున్న `ప్రెమెంత ప‌నిచేసే నారాయణ‌`

prementha panichese narayana movie positive talkహ‌రికృష్ణ‌, అక్షిత జంట‌గా జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో  జెఎస్ ఆర్ మూవీస్ ప‌తాకంపై సావిత్రి జొన్న‌ల‌గ‌డ్డ నిర్మంచిన  `ప్రేమెంత ప‌నిచేసే నారాయణ`  ఈనెల 22న విడుద‌లై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో హీరో హ‌రికృష్ణ మాట్లాడుతూ, `తొలి షోతోనే సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ బాగుంది. మంచి రివ్యూలు వ‌చ్చాయి. అంతా హ‌రి బాగా చేసాడంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. న‌ట‌న‌, డాన్సులు, డైలాగులు బాగా చెప్పాడ‌ని క్రిటిక్స్ నుంచి సైతం ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇవ‌న్నీ నాకు మంచి బ్ల‌స్సింగ్స్. మొద‌టి సినిమాతోనే పాజిటివ్ టాక్  తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. షూటింగ్ స‌మ‌యంలో నా టీమ్ అంతా స‌పోర్ట్ గా ఉంది. స‌మిష్టి గా ప‌నిచేసాం. రిలీజ్ క ముందు సోష‌ల్ మీడియాలో మంచి పాజిటివ్ బ‌జ్ క్రియేట్ అయింది. అది మా సినిమాకు బాగా క‌లిసొచ్చింది.  ఇలాంటి సినిమాకు మ‌రిన్ని థియేట‌ర్లు దొరికితే బాగుండేది` అని అన్నారు.

 

అక్షిత మాట్లాడుతూ, ` రిలీజ్ కు ముందే కాన్పిడెంట్ గా ఉన్నాం. మా న‌మ్మ‌కాన్ని ప్రేక్ష‌కులు నిల‌బెట్టారు. అందుకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు. సినిమాకు మంచి రివ్యూలు కూడా వ‌చ్చాయి. అవి మ‌రింత‌గా క‌లిసొచ్చాయి. కొత్త వాళ్లని ఇలాగే ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

 

ద‌ర్శ‌కుడు జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ, ` ఎదురు లేని మ‌నిషి`, `మా అన్న‌య్య బంగారం`, `బంగారు బాబు`,` జ‌గ‌ప‌తి` ఇలా చాలా సినిమాలను డైరెక్ట్ చేసాను. స్టార్ హీరోలు నాగార్జున‌, జ‌గ‌ప‌తిబాబు, బాల‌కృష్ణ, రాజ‌శేఖ‌ర్, శ్రీకాంత్ గారితో చేసాను. కోడైరెక్ట‌ర్ గా ఎన్నో సినిమాల‌కు ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. కానీ ఈ క‌థ కొత్త వాళ్ల‌తో చేస్తే నే బాగుంటుంద‌ని చేసా. అందుకే మా అబ్బాయిని హీరోగా పెట్టి చేసా. నేను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా చేసా. సినిమా చూసిన వారంతా హ‌రి బాగా చేసాడ‌ని ఫోన్లు చేసి చెబుతున్నారు. ఇండ‌స్ర్టీలో ఉన్న స‌న్నిహితులు కూడా హ‌రి డాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ చ‌క్క‌గా చేసాడ‌ని మెచ్చుకున్నారు. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఎంతో బాగుంది. క్రిటిక్స్ సైతం ప్ర‌శంసించారు. మంచి రివ్యూలు ఇచ్చారు. `ఎదురులేని మ‌నిషి` సినిమాకి కూడా ఇంత పాజిటివ్ రివ్యూలు రాలేదు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి, కాలేజీ స్టూడెంట్స్  అంద‌రికీ బాగా క‌నెక్ట్ అయింది.  కానీ ఒక‌టే అసంతృప్తి. థియేట‌ర్లు ఇచ్చారు. క‌లెక్ష‌న్స్ బాగున్నాయి. కానీ ఇంకా ఎక్కువ‌గా దొరికి ఉంటే బాగుండేది. థియేట‌ర్లు పెంచుతార‌ని ఆశిస్తున్నా. అంత అనుభవం ఉన్నా థియేట‌ర్లు సంపాదించుకోలేక‌పోయాన‌నే బాధ ఉంది` అని అన్నారు.

 

నిర్మాత సావిత్రి మాట్లాడుతూ, ` న‌టుడిగా  మా అబ్బాయి హ‌రి పాస‌య్యాడు. చాలా సంతోషంగా ఉంది. కానీ నిర్మాత‌గా థియేట‌ర్లు దొర‌క‌లేద‌నే బాధ  బాధ ఉంది. అంతా  సపోర్ట్ చేసారు. కానీ మొద‌ట్లోనే ఎక్కువ థియేట‌ర్లు ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్ప‌టికైనా థియేట‌ర్లు పెంచుతార‌ని ఆశిస్తున్నా`  అని అన్నారు. సినిమా ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు న‌టుడు రాహుల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Director Kodi ramakrishna died35 Lakhs Fine to Mahesh babu AMB


Kani Kusruti faced sexual harrasmentSri Reddy: Koratala Siva is the boss of KamasutraMalika Arora revealed her divorce



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2XuZb55

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...