Skip to main content

`15-18-24 లవ్ స్టోరీ` టైటిల్ లోగో ఆవిష్క‌ర‌ణ‌

15-18-24 Love story movie title logo launchedఅన్న‌పూర్ణ స్టూడియోస్‌లో `15-18-24 లవ్ స్టోరీ` టైటిల్ లోగో ఆవిష్క‌ర‌ణ‌

15 వ‌య‌సు.. 18 వ‌య‌సు.. 24 వ‌య‌సు.. ఈ మూడు ద‌శ‌ల్లో ప్రేమ ఎలా ఉంటుంది? ఆ ప్రేమ‌ల్లో గ‌మ్మ‌త్త‌యిన సంగ‌తులేంటి?  ఈ ట్రాక్ లోనే ఊహించ‌ని ఓ యాక్సిడెంట్ మొత్తం క‌థను ఎలా మ‌లుపు తిప్పింది? అన్న‌దే `15-18-24 లవ్ స్టోరీ` అని అంటున్నారు ద‌ర్శ‌కుడు కిర‌ణ్‌. నిఖిలేశ్వర్, సాహితి, కీర్తన్, సిమ్రాన్ సానియా, ఉపేంద్రా, పారుల్ బిందల్ , ఈషా ,ధన్య శ్రీ  ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న‌ చిత్రం `15-18-24 లవ్ స్టోరీ`. మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. విమాలాద్రి క్రియేషన్స్,  మాజేటి మూవీ మేకర్స్ , కిరణ్ టాకీస్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డా.అక్కినేని నాగేశ్వ‌ర‌రావు సెంటిమెంట్ పూజా గృహం.. హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్‌లో ఈ సినిమా టైటిల్ లోగో రిలీజైంది. ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ వార‌సుడు రాహుల్ విజయ్ – సంతోషం అధినేత‌ సురేష్ కొండేటి సంయుక్తంగా లోగోని ఆవిష్క‌రించారు.

దర్శకుడు కిరణ్ కుమార్ మాడుపూరి మాట్లాడుతూ-కులుమ‌నాలి, గోవా, హైద‌రాబాద్ లో మూడు ప్రేమ జంటల మధ్య సాగే ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. చక్కటి కధ , కధనాలతో ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. కులుమనాలి, హైద‌రాబాద్, కేరళ, గోవాలో చిత్రీకరించారు. మూవీలో ఓ యాక్సిడెంట్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.  ఆ సీన్ ని ఫైట్ మాస్టర్ విజయ్ తెలుగు సినీ చరిత్రలో కనీ వినీ ఎరుగనీ రీతిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు  శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి సమ్మర్ లో సినిమా రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

నిర్మాత‌లు బొద్దుల సుజాత శ్రీ‌నివాస్, స్ర‌వంతి ప్ర‌సాద్ మాట్లాడుతూ-“70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. చివ‌రి ఫైట్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తున్నాం. ఆడియో త్వ‌ర‌లో రిలీజ్ చేస్తాం. సూప‌ర్ హిట్ చిత్రం అవుతుంది“ అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు జ‌య‌వ‌ర్ధ‌న్ మాట్లాడుతూ -“ఇందులో మూడు ప్రేమ‌క‌థ‌లు ఆస‌క్తిక‌రం. యాక్సిడెంట్ నేప‌థ్యం అద్భుతంగా ఉంటుంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే చిత్ర‌మిది. మూడు ప్రేమ‌క‌థ‌ల‌కు మూడు ర‌కాల టోన్ ల‌లో సంగీతం అందించ‌డం ఎంతో క‌ష్టంతో కూడుకున్న‌ది. సంగీతం మైమ‌రిపిస్తుంది“ అస్నారు.

నిఖిలేశ్వర్, సాహితి, కీర్తన్, సిమ్రాన్ సానియా, ఉపేంద్రా, పారుల్ బిందల్, ఈషా, ధన్య శ్రీ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని త‌మ‌కు అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని ఆకాంక్షించారు.

ఈ సినిమాకి నిర్మాతలు : బొద్దుల సుజాతాశ్రీనివాస్, స్రవంతి ప్రసాద్. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ : పి. హజారత్ బాబు. సంగీతం: జయవర్ధన్.అంకే, కెమెరా: రాజేష్, ఫైట్స్: విజయ్ మాస్టర్ , కోరియోగ్రఫీ : గణేష్ మాస్టర్, కో-డైరెక్టర్ & ఎడిటర్ : సన్నపు కుమార్ బాబు, పి.ఆర్.వో : సురేష్ కొండేటి.

English Title: 15-18-24 Love story movie title logo launched

35 Lakhs Fine to Mahesh babu AMBKani Kusruti faced sexual harrasmentSri Reddy: Koratala Siva is the boss of KamasutraMalika Arora revealed her divorce



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2VhLNzo

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...