Skip to main content

నవ్వించేందుకు బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సిద్ధం…

bilalpur police station get release dateజీవితంలో ఎన్నో ఒత్తిడులు. రోజంతా కష్టానికి మనపై పడిన ప్రభావమది. ఒక చిన్న చిరునవ్వు ఆ మొత్తం ఒత్తిడిని చిత్తు చేస్తుంది. మనసుకు హాయినిస్తుంది. మనం పడిన శ్రమనంతా గతాన్ని చేసేస్తుంది. మరి అలాంటి నవ్వు రెండున్నర గంటలు దక్కితే ఎంత ఉల్లాసంగా ఉంటుంది. అలాంటి నవ్వును పంచేందుకు సిద్ధమవుతున్న చిత్రమే బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. ఈ చిత్రాన్ని ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మించారు. .యువ దర్శకుడు నాగసాయి మాకం తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించారు. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించిన బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలో గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా మార్చి 15న ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది.

 

ఈ సందర్భంగా నిర్మాత మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ…సినిమా ధ్యేయం వినోదాన్ని పంచడం అయితే నవ్విస్తూ ఒక చిన్న ఆలోచన ప్రేక్షకుల్లో కలిగిస్తే ఆ చిత్రానికి సార్థకత చేకూరినట్లే. అలాంటి సార్థక చిత్రమే బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలతో సందేశాన్ని కలిపి ఈ చిత్రాన్ని నిర్మించాం. ఎంత నాణ్యమైన చిత్రాన్ని నిర్మించామో, అంతే ఘనంగా మార్చి 15న విడుదల చేస్తున్నాం. అన్నారు.

 

దర్శకుడు నాగసాయి మాకం మాట్లాడుతూ….నా తొలి చిత్రం ప్రేక్షకుల తీర్పునకు వస్తుండటం సంతోషంగా ఉంది. మేము రూపొందించిన సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాము. ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోంది మా సినిమా. బిలాల్ పూర్ కథలో నవ్వులు, బాధలు, సంఘ విద్రోహ శక్తుల దుశ్చర్యలు, పోలీసు ఉద్యోగంలోని సాదకబాధకాలు అన్నీ ఉంటాయి. సంగీత సాహిత్యాలు ఆకట్టుకుంటాయి. సాబూ వర్గీస్ సంగీతం, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనశ్రీ మల్లిక్, నీల నర్సింహా పాటలు కథా విలువను పెంచుతాయి. సమాజంలో జరుగుతున్నకొన్ని చేదు ఘటనలు కూడా ఉంటాయి. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది. అన్నారు.

 

ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – తోట వి రమణ, ఎడిటింగ్ – ఎస్ బీ ఉద్ధవ్, సంగీతం – సాబూ వర్గీస్, రీ రికార్డింగ్ – జీబూ, డీటీఎస్ – రాజశేఖర్, పాటలు – గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనిశ్రీ మల్లిక్, నీల నర్సింహా, కథా, నిర్మాత – మహంకాళి శ్రీనివాస్, రచన, దర్శకత్వం – నాగసాయి మాకం.

Director Kodi ramakrishna died35 Lakhs Fine to Mahesh babu AMB


Kani Kusruti faced sexual harrasmentSri Reddy: Koratala Siva is the boss of KamasutraMalika Arora revealed her divorce



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EiJKEE

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...