Skip to main content

క్రిష్ పరిస్థితి ఏంటి ?

Director Krish in dilemmaఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు  కూడా ఒకదాన్ని మించి ఒకటి ప్లాప్ అయ్యాయి దాంతో క్రిష్ పరిస్థితి డోలాయమానంలో పడింది . బాలీవుడ్ లో చేసిన మణికర్ణిక వివాదాన్ని రాజేసి ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది అయితే దాని సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ కథానాయకుడు ఆడొచ్చు అని అనుకుంటే అది డిజాస్టర్ అయ్యింది . దాంతో షాక్ తిన్న క్రిష్ ఎన్టీఆర్ మహానాయకుడు కు కొన్ని రిపేర్లు చేసారు కానీ ఇది ఇంకా దారుణం .

 

మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ ఇంకా డిజాస్టర్ అయ్యింది . దాంతో క్రిష్ తదుపరి సినిమా ఏంటి ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . క్రిష్ తో పలువురు హీరోలు సినిమాలు చేయాలనీ ఆశపడ్డారు కానీ రెండు నెలల కాలంలో మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి దాంతో క్రిష్ పరిస్థితి నిజంగా డోలాయమానంలో పడింది . ఈ దర్శకుడితో సినిమా చేయడానికి అంత తొందరగా ఏ హీరో కూడా ముందుకు రాడు ఎందుకంటే సక్సెస్ మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది కానీ వ్యక్తిగత పరిచయాలు కాదు .

English Title: Director Krish in dilemma

35 Lakhs Fine to Mahesh babu AMBKani Kusruti faced sexual harrasmentSri Reddy: Koratala Siva is the boss of KamasutraMalika Arora revealed her divorce



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EuGZBb

Comments