Skip to main content

మ‌హేష్‌బాబు నిర్మాతగా అడివిశేష్ హీరోగా రూపొంద‌నున్న `మేజ‌ర్‌`

mahesh babu to produce major movieఇండియాలో ప్ర‌ముఖ నిర్మాణ‌, పంపిణీ సంస్థ సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌ల‌యిక‌లో `మేజ‌ర్` అనే భారీ చిత్రం రూపొంద‌నుంది. అడివి ఎంట‌ర్ టైన్మెంట్‌, శ‌ర‌త్ చంద్ర‌, ఎ+జి మూవీస్ ఈ సినిమా నిర్మాణంలో స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. మేజ‌ర్ సినిమా షూటింగ్‌ను 2019 వేస‌విలో ప్రారంభిస్తారు. 2020లో సినిమాను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

ద్వి భాషా చిత్రంగా తెలుగు, హిందీ భాష‌ల్లో భారీ బడ్జెట్‌తో నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొంద‌బోయే ఈ సినిమా శౌర్యం, త్యాగం మేళ‌వింపుగా ఇన్‌స్ఫైర్ చేసేలా ఉంటుంది. ఈ చిత్రం ద్వారా సోనీ పిక్చ‌ర్స్ సంస్థ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. అలాగే జిఎంబి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌నుంది. ఈ సినిమాతో తెలుగు సినిమా రేంజ్ పెర‌గ‌నుంది.

26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ ఇన్‌స్పిరేష‌న్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. క్ష‌ణం, గూఢ‌చారి వంటి సూప‌ర్ డూప‌ర్ చిత్రాల్లో న‌టించి మెప్పించిన అడివిశేష్ ఇందులోహీరోగా న‌టిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు ర‌చ‌యిత‌గా కూడా వ‌ర్క్ చేశారు అడివిశేష్. గూఢ‌చారి ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్క ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారు.

సోనీ పిక్చ‌ర్స్ ఇంటర్నేష‌న‌ల్ ప్రొడ‌క్షన్స్ హెడ్ లెయినె క్లెయినె మాట్లాడుతూ – “ప్యాడ్ మాన్‌, 102 నాటౌట్ వంటి బాలీవుడ్ చిత్రాల‌తో పాటు మ‌ల‌యాళ చిత్రం 9ని ప్రేక్ష‌కుల‌కు అందించి వారికి ద‌గ్గ‌ర‌య్యాం. మేజ‌ర్ సినిమా విష‌యానికి వ‌స్తే ఇది శ‌క్తివంత‌మైన క‌థే కాదు.. మ‌న దేశంలోని వారిని, స‌రిహ‌ద్దుల‌ను దాటి ఉన్న ఇండియ‌న్స్‌ను ఇన్‌స్పైర్ చేసే చిత్ర‌మిది. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి ఇలాంటి ఓ గొప్ప సినిమాతో ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది“ అన్నారు.

సోని పిక్చ‌ర్స ఎంట‌ర్‌టైన్‌మెంట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వివేక్ కృష్ణాని మాట్లాడుతూ – “మ‌హేష్‌గారు, న‌మ్ర‌త‌గారితో అసోసియేట్ కావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే వారిని హిందీ చిత్ర సీమ‌లోకి  మ‌న‌స్ఫూర్తిగా అహ్వానిస్తున్నాం. అలాగే హీరో అడివిశేష్‌, డైరెక్ట‌ర్ శ‌శికిర‌ణ్ తిక్క ల‌కు కూడా బాలీవుడ్‌లోకి వెల్‌కం చెబుతున్నాం“ అన్నారు.

జి.మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్మెంట్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఘ‌ట్ట‌మ‌నేని మాట్లాడుతూ – “మా జిఎంబి బ్యాన‌ర్‌లో ఇలాంటి యూనిక్, ఒరిజిన‌ల్ స్టోరీ తెర‌కెక్కించ‌బోతున్నందుకు హ్య‌పీగా ఉంది. ఇదొక నేష‌న‌ల్ హీరో మూవీ. మేజ‌ర్ సినిమా క‌థ విష‌యంలో అడివిశేష్‌, శ‌శికిర‌ణ్ తిక్క నిజాయతీ, విజ‌న్ ఆక‌ట్టుకున్నాయి. సోనీ పిక్చ‌ర్స్ రూపంలో మంచి నిర్మాణ సంస్థ మాతో జ‌త క‌లిసింది. ఇండియ‌న్ సినిమాల్లోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సినిమాల‌ను తీసుకొచ్చేలా సోనీ పిక్చ‌ర్స్‌తో క‌లిసి ముందుకు వెళ్తాం“ అన్నారు.

Director Kodi ramakrishna died35 Lakhs Fine to Mahesh babu AMB


Kani Kusruti faced sexual harrasmentSri Reddy: Koratala Siva is the boss of KamasutraMalika Arora revealed her divorce



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2VqrJLr

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...