
దాంతో ఆ సినిమాని కొన్న బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు . బయోపిక్ అంటే ఎన్టీఆర్ జీవితంలోని కష్టసుఖాలు అన్నీ ఉండాలి కానీ బాలయ్య – క్రిష్ తీసిన బయోపిక్ లో సగం మాత్రమే వాస్తవం ఉంది పైగా సెకండ్ పార్ట్ లో తమ ఇష్టానికి అనుగుణంగా మార్చుకున్నారు చంద్రబాబు పాత్రని ఎలివేట్ చేసారు . ఎన్టీఆర్ చివరి రోజులు కూడా సినిమాలో ఉంటే అది సంపూర్ణమైన బయోపిక్ అయ్యుండేది కానీ బసవతారకం చనిపోయేంత వరకు మాత్రమే చూపించి ఇదే బయోపిక్ అన్నారు అందుకే జనాలకు నచ్చలేదు . ఎన్టీఆర్ బయోపిక్ అని చెప్పి ఆ మహనీయుడి పరువుని తీయడానికి తీసినట్లుంది తప్ప ఉపయోగం లేకుండాపోయింది . సావిత్రి బయోపిక్ మహానటి ప్రభంజనం సృష్టించింది , వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర హిట్ అయ్యింది కానీ తెలుగుజాతి పౌరుషాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన మహనీయుడి బయోపిక్ మాత్రం ఘోర పరాజయాన్ని అందుకొని చరిత్ర పుటల్లో విషాదాన్ని నింపింది .
English Title: NTR biopic creates worst record in telugu film industry
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tEHbYq







Comments
Post a Comment