Skip to main content

‘118’ ట్రైలర్‌ లాంచ్‌

118 Movie trailer launchడైనమిక్‌ హీరో నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న స్టైలిష్‌ యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘118’. నివేదా థామస్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా…

 

మిర్చి కిరణ్‌ మాట్లాడుతూ – ”నేను ఈ సినిమాకు డైలాగ్‌ రైటర్‌గా పనిచేశాను. ట్రైలర్‌ చూడటానికి స్లిక్‌గా, స్టయిలిష్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉందో.. మొత్తం సినిమా అంతా కంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సినిమా గురించి తెలిసినా.. మళ్లీ సినిమా చూడాలనే ఆసక్తి తగ్గడం లేదు. సీట్‌ ఎడ్జ్‌ మూమెంట్స్‌ చాలానే ఉన్నాయి. కల్యాణ్‌రామ్‌గారు స్టైలిష్‌గా కనపడుతున్నారు. రైటింగ్‌ టైమ్‌లో సినిమా అనుకున్న దాని కంటే సూపర్బ్‌గా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది” అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌చంద్ర మాట్లాడుతూ – ”ఈ సినిమాలో నన్ను భాగం చేసిన కల్యాణ్‌రామ్‌గారికి, నిర్మాత మహేష్‌ కొనేరుగారికి థాంక్స్‌. చాలా సినిమాలు చేస్తుంటాం. కానీ ఇలా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి స్కోప్‌ ఉన్న సినిమాలు రావడం అరుదుగా జరుగుతుంటాయి. గుహన్‌గారితో పనిచేయడం వల్ల చాలా విషయాలను నేర్చుకున్నాను. సినిమాలో చాలా ఇన్‌టెన్‌సిటీ ఉంది. చాలా ఎమోషన్స్‌ ఉన్న ఇన్‌టెన్స్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. హీరో నుండి పాజిటివిటీ, ఎనర్జీ సినిమా అవుట్‌పుట్‌ బాగా రావడానికి తోడ్పడింది. చందమామే సాంగ్‌ ఇప్పటికే చాలా పెద్ద హిట్‌ అయ్యింది. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌” అన్నారు.

నివేదా థామస్‌ మాట్లాడుతూ – ”నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిన చిత్రమిది. తక్కువ టైంలో చాలా ఎక్కువగా వర్క్‌ చేసిన సినిమా. చాలా హార్డ్‌ వర్క్‌తో యూనిట్‌ ఈ సినిమాను పూర్తి చేశాం. సినిమాలో చాలా పొటెన్షియల్‌ ఉంటుంది. అసలు 118 ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌గా పేరున్న గుహన్‌ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించారు. సినిమా అందరికీ నచ్చుతుంది. ఎంటైర్‌ యూనిట్‌కు థాంక్స్‌” అన్నారు.

నిర్మాత మహేష్‌ కొనేరు మాట్లాడుతూ – ”కల్యాణ్‌రామ్‌గారికి, గుహన్‌గారికి చాలా థ్యాంక్స్‌. ఎందుకంటే చాలా మంచి సినిమాను ఇచ్చారు. కొన్ని సినిమాలు చేసేటప్పుడు మనకు చాలా సంతృప్తిగా అనిపిస్తాయి. అలాంటి సంతృప్తినిచ్చిన సినిమా ఇది. నాకు చాలా స్పెషల్‌ మూవీ అని చెప్పుకోవడానికి గర్వంగా అనిపిస్తుంది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కల్యాణ్‌రామ్‌గారి నటన, గుహన్‌గారి టేకింగ్‌, నివేదా, షాలినిగారి నటన .. ఇలా అన్నీ అద్భుతంగా కుదిరాయి. శేఖర్‌ చంద్రగారు అద్భుతమైన సంగీతంతో పాటు ఎక్స్‌ట్రార్డినరీ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. మార్చి 1న సినిమా విడుదలవుతుంది” అన్నారు.

చిత్ర దర్శకుడు కె.వి.గుహన్‌ మాట్లాడుతూ – ”మంచి కథతో మిళితమైన థ్రిల్లర్‌ సినిమా ఇది. తెలుగులో చాలా మంచి చిత్రాలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాల్లో నేను కూడా ఒక భాగం కావాలని అనుకున్నాను. నేను కథ చెప్పగానే మొదటిసారే సినిమాకు ఓకే చెప్పేశారు. ఎంతగానో సపోర్ట్‌ అందించారు. నాకు సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌. సినిమాటోగ్రాఫర్‌ నుండి దర్శకుడిగా మారిన తర్వాత ఓ టీం సినిమా కోసం ఎంత కష్టపడతారో ఇంకా బాగా అర్థమైంది. సినిమాలో భాగమైన అందరికీ థాంక్స్‌. ఎడిటర తమ్మిరాజుగారు చక్కటి గైడెన్స్‌ ఇచ్చారు. శేఖర్‌ చంద్ర తన మ్యూజిక్‌తో ఒక స్పేస్‌ క్రియేట్‌ చేశారు. ఇలాంటి సినిమాకు రీరికార్డింగ్‌ చాలా కీలకంగా ఉంటుంది. అలాంటి రీరికార్డింగ్‌ అందించడానికి శేఖర్‌ చంద్ర ప్రయత్నిస్తున్నారు. నివేదా ఓ బాధ్యతాయుతమైన పాత్రలో నటించింది. సినిమా కథంతా ఆమె చుట్టునే తిరుగుతుంది. పాత్రలోకి లీనమైపోయింది. సినిమా రిలీజ్‌ తర్వాత తన గురించి అందరూ మాట్లాడుకునేంత గొప్పగా నటించింది. అర్జున్‌రెడ్డి తర్వాత షాలిని నటించినన చిత్రమిది. ఇక కల్యాణ్‌రామ్‌ గురించి చెప్పాలంటే .. ముందు రోజే ఏం చేయాలి? ఎలా చేయాలి? అని డిస్కస్‌ చేసుకుని ప్రిపేర్‌ అయ్యి వచ్చేవాడు. ఓ వ్యక్తిగా ఎంతగానో సపోర్ట్‌ అందించారు. నిర్మాత మహేష్‌గారికి థాంక్స్‌. ఎందుకంటే కథ వినగానే ఎగ్జయిట్‌మెంట్‌తో తనవంతు సపోర్ట్‌ ఇచ్చారు” అన్నారు.

నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ – ”ట్రైలర్‌ను లోతుగా అబ్జర్వ్‌ చేస్తే సినిమా ఏంటో అర్థమైపోతుంది. నివేదా థామస్‌గారికి థాంక్స్‌. ఆమెను బేస్‌ చేసుకునే మొత్తం కథంతా రన్‌ అవుతుంది. మంచి పెర్ఫామెన్స్‌ ఇచ్చారు. కంటితడి పెట్టించారు. ఆమెకు ఈ సందర్భంగా థాంక్స్‌. గుహన్‌గారు ఈ సినిమాలో నాలుగు బాధ్యతలు నిర్వహించారు. స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయానికి వస్తే.. చాలా ఎగ్జయిట్‌ అయ్యాం. ఈ కథ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. కానీ మనం పట్టించుకోం.. వదిలేస్తాం. కథ చెప్పగానే నేను కూడా కనెక్ట్‌ అయ్యాను. అందుకనే సినిమా చేయడానికి వెంటనే ఓకే చెప్పేశాను. గుహన్‌గారి సినిమాటోగ్రఫీ గురించి నేను చెప్పేంత పెద్దవాడిని కాను. కానీ.. డైరెక్షన్‌ విషయానికి వస్తే ఓ ప్లానింగ్‌తో వర్క్‌ చేసుకుంటూ వచ్చారు. ఆర్టిస్ట్‌గా అందరినీ ఫీలై నటించమని చెప్పారు. ఎలాంటి రిస్ట్రిక్షన్‌ లేకుండా చేయించారు. ఈ సినిమాకు పనిచేసే క్రమంలో ఆయన కొత్త దర్శకుడనే భావనే కలగలేదు. నిర్మాత మహేష్‌ నాకు కుటుంబ సభ్యుడితో సమానం. ముందు ఈ కథను ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌లో చేద్దామనేంత బాగా నచ్చింది. అయితే మహేష్‌గారు లైట్‌గా కథవిని పూర్తి కథ వినొచ్చా? అన్నారు. వినమని నేను చెప్పాను. వినగానే నేను ఎగ్జయిట్‌ అయినంతగా తను ఎగ్జయిట్‌ అయ్యి సినిమా చేయడానికి రెడీ అయ్యారు. కిరణ్‌గారు చాలా చక్కటి డైలాగ్స్‌ అందించారు. శేఖర్‌ చంద్ర ఎక్సలెంట్‌ మ్యూజిక్‌ అందించారు. రీరికార్డింగ్‌ ఇంకా అద్భుతంగా నిలిచారు. తమ్మిరాజుగారు బ్యాక్‌బోన్‌లా నిలిచి సపోర్ట్‌ చేశారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ థాంక్స్‌. మార్చి 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా చూసి నాలానే అందరూ ఎగ్జయిట్‌ అవుతారని భావిస్తున్నాను” అన్నారు.

 

Dangal beauty Fatima sana shaikh cleavage showAllu arjun confirmed in sye raa narasimha reddyTopless Padma Lakshmi pizza party in bath tubNamrata comments on mahesh political entryNagababu sensational comments on Niharika marriage



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GtgEFM

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...