Skip to main content

భారీ ఎత్తున ఈనెల 22న ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న `ప్రేమెంత ప‌నిచేసే నారాయణ‌`

Prementha Panichese Narayana to release on 22nd Febద‌ర్శ‌కుడు జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస‌రావు త‌న‌యుడు హ‌రికృష్ణ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం `ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌`. అక్షిత క‌థానాయిక‌. ఝాన్సీ ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. జెఎస్ ఆర్ మూవీస్ ప‌తాకంపై సావిత్రి జొన్న‌ల‌గ‌డ్డ నిర్మిస్తున్నారు. యాజ‌మాన్య సంగీతం  అందించారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తగా విడుద‌ల‌వుతుంది.   ఈ సంద‌ర్బంగా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్  ఆదివారం హైద‌రాబాద్ సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన న‌టుడు శ్రీకాంత్ తొలి జ్ఞాపిక‌ని యాజ‌మ‌న్య‌కు అందించారు.

 

అనంత‌రం శ్రీకాంత్ మాట్లాడుతూ, `  శ్రీనివాస‌రావు చాలా సంవ‌త్స‌రాలుగా తెలుసు. త‌నకి సిన‌మా త‌ప్ప మ‌రో ప్ర‌పంచం తెలియ‌దు. చాలా సినిమాల‌కు ప‌నిచేసిన అనుభ‌వం  ఉంది. మంచి టెక్నిషీయ‌న్. వాళ్ల‌బ్బాయిని హీరోగా ప‌రిచయం చేస్తూ త‌నే అన్ని బాధ్య‌త‌లు తీసుకుని ఎన్ని క‌ష్టాలు ఎదురైనా ఫ్యాష‌న్ తోనే శ్ర‌మించాడు. హ‌రి లో మంచి జీల్ ఉంది. సినిమా కోసం త‌ను కూడా చాలా హార్డ్ వ‌ర్క్ చేసాడు.  డాన్సులు ఇర‌గ‌దీసాడు. ఫ్యూచ‌ర్ లో  మంచి స్టార్ అవుతాడ‌న్నా`రు.

కాశీ విశ్వ‌నాథ్ మాట్లాడుతూ, ` శ్రీనివాసరావు మంచి  మిత్రుడు. త‌న గ‌త సినిమాల్లో నేను కూడా న‌టించాను. `న‌చ్చావు`లే సినిమా త‌ర్వాత శ్రీను అలాంటి మంచి పాత్ర ఈ సినిమ‌లో ఇచ్చాడు. ఆ సినిమాక‌న్నా ఈ చిత్రం పెద్ద స‌క్సెస్ అవ్వాలి` అని అన్నారు.

మ‌రుదూరి రాజా మాట్లాడుతూ, ` హ‌రిలో మంచి ఫైర్,పెర్పామెన్స్ ఉంది. అంత‌కు మంచి ఎనెర్జీ లెవ‌ల్స్ ఉన్నాయి. మంచి క‌థ‌తో హీరోగా ప‌రిచయం అవుతున్నాడు. హీరో- ఝాన్సీ పాత్ర‌ల మ‌ధ్య స‌వాల్ తో క‌థ న‌డుస్తుంది. అక్క‌డ ఎదురైన ఓ స‌వాల్ అమ్మాయి ప్రేమ‌కు ఎలా దారితీసింద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. రెండు పాత్ర‌లు సినిమాలో బాగా పండుతాయి. ఈ సినిమా కోసం తండ్రీ కొడుకులిద్ద‌రూ ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు. ఈ సినిమా ను ప్రేక్ష‌కులంతా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

చిత్ర హీరో  హ‌రికృష్ణ మాట్లాడుతూ, ` రెగ్యుల‌ర్ ల‌వ్ స్టోరీల‌కు భిన్నంగా ఉంటుంది. ఇదో పెయిన్ పుల్ స్టోరీ. ప్రేమ‌కు కొత్త అర్ధం చెప్పే సినిమా. ప్రేమ అంటే అమ్మాయి అబ్బాయి ఉంటే స‌రిపోతుంద‌నుకుంటారు. కానీ స్నేహితుడు లేక‌పోతే ప్రేమ లేద‌ని చెప్పే సినిమ ఇది. స్నేహితుడి విలువ‌ను చాటి చెప్పే క‌థ‌. క్లైమాక్స్ ఆద్యంత ఆస‌క్తిక‌రంగా  ఉంటుంది.  ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు త‌ల్లిదండ్రులైనా చాలా ప్రొఫెష‌నల్ గా వ్వ‌వ‌హ‌రించారు. ఈనెల 22న సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్ష‌కులంతా విజ‌యవంతం చేస్తార‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.

హీరోయిన్ అక్షిత్ మాట్లాడుతూ, ` రొటీన్ ప్రేమ క‌థ‌ల‌కు భిన్నంగా ఉంటుంది. చాలా రియ‌ల్ స్టిక్ గా ఉండే సినిమా ఇది.  చాలా స‌న్నివేశాలు ఎమోష‌న్ తో న‌డుస్తాయి` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు జొన్న‌లగ‌డ్డ  శ్రీనివాస‌రావు మాట్లాడుతూ, `సీనియ‌ర్  ఎన్టీఆర్ గారు న‌టించిన మేజ‌ర్ చంద్ర కాంత్ తో పాటు చాలా సినిమాల‌కు ప‌ని చేసాను. త‌ర్వాత కొన్ని సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాను. క‌థ‌ను న‌మ్మి చేసిన సినిమా ఇది. ఈ క‌థ గురించి కొంద‌రికి చెబితే కొన్ని స‌ల‌హాలు ఇచ్చారు. కానీ అవేవి నాకు న‌చ్చ‌లేదు. నేను తీయాల‌నుకున్న‌ది తీసాను. బాగా వ‌చ్చింద‌ని న‌మ్ముతున్నాం. హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కూ డా మంచి ధ‌ర ద‌క్కింది. అల్లు అర‌వింద్ గారు సినిమాకు ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తున్నారు. ఆయ‌న స‌హ‌కారం ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిది. ఈనెల 22న‌ ప్రేక్ష‌కుల మందుకు వ‌స్తున్నాం. త‌ప్ప‌కుండా అద‌రిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

గంగారావు, రాహుల్ బొకాడియా, ఏఆర్ సి బాబు, రాజారావు, రాఘ‌వ‌పూడి, సిప్పీ, పింగ్ పాంగ్, మింటు, రాహుల్, వినీత్, అవినాష్, వాణి చౌద‌రి,  రాజు, ర‌సూల్, విటాల్, వేదాంత్ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: వ‌న‌మాలి, గోస‌ల రాంబాబు, ఛాయాగ్ర‌హ‌ణం: వ‌ంశీ ప్ర‌కాష్, ఎడిటింగ్:  జాన‌కి రామ్, కో డైరెక్ట‌ర్  :   సిప్పీ, పీర్ ఓ: స‌తీష్‌,  స్ర్కీన్ ప్లే భూప‌తి రాజా, మ‌రుధూరి రాజా, రాజేంద్ర కుమార్, మాట‌లు:  సుబ్బారాయుడు బొంపెం, కొరియోగ్ర‌పీ: ప‌్రేమ్ ర‌క్షిత్, విద్యాసాగ‌ర్, శ్రీద‌న్, ఫైట్స్:  రామ్ సుంక‌ర‌,  నిర్మాత :  సావిత్రి జొన్న‌ల‌గ‌డ్డ‌

 

English Title: Prementha Panichese Narayana to release on 22nd Feb

Dangal beauty Fatima sana shaikh cleavage showAllu arjun confirmed in sye raa narasimha reddyTopless Padma Lakshmi pizza party in bath tubNamrata comments on mahesh political entryNagababu sensational comments on Niharika marriage



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GvCKI0

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...