Skip to main content

హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌

 "4 letters" is my first film and it came out so well." - Hero Eswarబాగా చ‌ద‌వ‌డం, మంచి మార్క‌లు తెచ్చుకోవ‌డం, ఉద్యోగం సంపాదించ‌డం, ల‌క్ష‌ల్లో జీతాలు తీసుకోవ‌డం ఇదేనా లైఫంటే..?.ఇంత‌కు మించి ఏమీ లేదా? అని ఆలోచిస్తోన్న క్ర‌మంలో నాకు ఎంతో ఇష్ట‌మైన సినిమా రంగం ప‌ట్ల ఆకర్షితుడ‌య్యాను. దీన్నే నా వృత్తిగా తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకోని హీరోగా `4లెట‌ర్స్` సినిమా చేసానంటున్నారు ఈశ్వ‌ర్‌. ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఉద‌య్ కుమార్ దొమ్మ‌రాజు , ఆర్‌. ర‌ఘురాజ్ ద‌ర్శ‌క‌త్వంలో `4 లెట‌ర్స్` చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 22న విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఈ సంద‌ర్భంగా యంగ్ హీరో ఈశ్వ‌ర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు…

న‌ట‌న‌లో శిక్ష‌ణ ఏమైనా తీసుకున్నారా?
గ‌తేడాది వైజాగ్ స‌త్యానంద్ గారి వ‌ద్ద మూడు నెల‌ల పాటు యాక్టింగ్ లో శిక్ష‌ణ తీసుకున్నాను. వారి ద‌గ్గ‌రే సినిమా గురించి, యాక్ట‌ర్ కావాల్సిన డిసిప్లేన్‌, డెడికేషన్ తో పాటు యాక్ట‌ర్ చేయాల్సిన హార్డ్ వ‌ర్క్ గురించి తెలుసుకున్నాను. అలాగే యుఎస్ లో ఉన్న‌ప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఆ అనుభ‌వం ఈ సినిమాకు చాలా హెల్ప‌యింది. అలాగే `ఆ ఇద్ద‌రూ` అనే ఒక షార్ట్ ఫిలింలో న‌టించాను. దానికి మంచి కాంప్లిమెంట్స్ వ‌చ్చాయి.

మీ ఫ్యామిలీకి ఇష్ట‌మేనా సినిమా ఫీల్డ్ లోకి రావ‌డం?
నా గ్రాడ్యుయేష‌న్ కంప్లీట్ అయ్యాక… ఇండియా కెళ్లి నా సినిమా ట్రైల్స్ నేను చేసుకుంటాను అని మా ఫ్యామిలీతో చెప్పాను. మా ఫ్యామిలీ కి కూడా సినిమాలంటే చాలా ఇంట్ర‌స్ట్ ఉండ‌టంతో ఓకే అన్నారు. స‌రే ఎవ‌రో ఎందుకు మ‌న‌మే ఒక బేన‌ర్ పెట్టి సినిమా చేద్దాం అని ఈ సినిమా చేశారు.

ద‌ర్శ‌కుడు గురించి చెప్పండి?
ర‌ఘురాజ్ గారు ఫుల్ స్క్రిప్ట్, లొకేష‌న్స్, షెడ్యూల్స్ తో స‌హా వ‌చ్చి క‌లిసారు. ఫ‌స్ట్ సిటింగ్ లో వారి క్లారిటీ అంద‌రికీ న‌చ్చ‌డంతో ఓకే చేశాం. అందులో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ప‌ది సినిమాల‌కు పైగా చేశారు. అంత ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న ద‌ర్శ‌కుడుతో సినిమా చేస్తే బావుంటుంద‌నిపించింది. అన్న‌ట్టుగానే వారి ద‌గ్గ‌ర నుంచి చాలా నేర్చుకున్నా. ఒక యాక్ట‌ర్ కి కావాల్సిన క్వాల‌టీస్ అన్నీ వారే నేర్పించారు. నేను ఈ సినిమాకు డ‌బ్బింగ్ చెప్పానన్నా, మంచి ప‌ర్ఫార్మెన్స్ ఇవ్వ‌గ‌లిగానన్నా ర‌ఘురాజే గారే కార‌ణం. రెండు నెల‌లు వ‌ర్క్ షాప్ పెట్టి మా అంద‌రికీ శిక్ష‌ణ ఇప్పించారు. ఇందులో డైలాగ్స్ చాలా కొత్త‌గా రాసారు. నా ఫ‌స్ట్ సినిమానే బెస్ట్ డైర‌క్ట‌ర్ తో చేశానన్న సంతృప్తి ఉంది.

సినిమా క‌థేంటి?
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే క‌థ ఇది. ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంది. ఏంటి? అన్న క‌థాంశానికి ల‌వ్‌, ఎంట‌ర్ టైన్ మెంట్ మిక్స్ చేసి `4లెట‌ర్స్` సినిమాను తెర‌కెక్కించారు మా డైర‌క్ట‌ర్. స్టూడెంట్స్ త‌ల‌చుకుంటే ఏమైనా చేయ‌గ‌ల‌రు అనే సందేశాన్ని ఫైన‌ల్ గా ఇచ్చాము. స్టూడెంట్స్ తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా సినిమా ఉంటుంది. క్లైమాక్స్ లో వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి.

ట్రైల‌ర్ చూస్తుంటే అడ‌ల్ట్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంద‌నిపిస్తోంది??
డైలాగ్స్ తో నే కామెడీ జ‌న‌రేట్ చేసాము త‌ప్ప , విజువ‌ల్ గా అయితే వ‌ల్గారిటీ ఉండ‌దు. ప్ర‌జంట్ యూత్ ఎలా బిహేవ్ చే్స్తున్నారో..వారు ఎలా మాట్లాడుకుంటున్నారో అలా నాచ‌రుల్ గా త‌ప్ప వాంటెడ్ గా డ‌బుల్ మీనింగ్ డైలాగులు పెట్ట‌లేదు.

మీ సొంత బేన‌ర్ లో సినిమా చేయ‌డం ఎలా అనిపించింది?
చాలా కంఫ‌ర్ట్ గా అనిపించింది. ఇంట్లోనే నాన్న‌, బాబాయి అన్న‌ట్టు ఉండేవాళ్లం. సెట్స్ మీద‌కు వెళితే…ఎవ‌రి చాలా ఫ్రొఫెష‌న‌ల్ గా ఉండేవాళం. మా ఫాద‌రే ప్రొడ్యూస‌ర్ కావ‌డంతో ఫ‌స్ట్ నుంచి ప్రొడ‌క్ష‌న్ గురించి తెలుసుకునే అవ‌కాశం క‌లిగింది. ప్ర‌తిది ప్లానింగ్ ప్రకారం వెళ్లడంతో ఎక్క‌డ మ‌నీ వేస్ట్ కాకుండా అనుకున్న టైమ్ కు సినిమా తీయ‌గ‌లిగాం.

టెక్నీషియ‌న్స్ గురించి చెప్పండి?
బెంగాల్ టైగ‌ర్, పేప‌ర్ బాయ్, గ‌రుడవేగ (డియో డియో) చిత్రాల‌కు ప‌ని చేసిన భీమ్స్ గారు మా సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రెండు మాస్, రెండు వెస్ట్ర‌న్ సాంగ్ ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. అలాగే ఆర్ ఆర్ కూడా అద్భుతంగా ఇచ్చారు. అలా సినిమాటోగ్ర‌ఫీ, గ‌ణేష్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌.

ఇందులో ఒక పాట కూడా పాడిన‌ట్టున్నారు?
అవునండీ నాకు ఫ‌స్ట్ నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే సినిమా ఫీల్డ్ లోకి వ‌చ్చాను. త‌బ‌ల‌, ఫ్లూట్ ప్లే చేస్తాను. భీమ్స్ గారు పాట‌ల ర‌చ‌యిత సురేష్ ఉపాధ్యాయ ద‌గ్గ‌రుండి నాతో పాడించారు. పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. నా క్యార‌క్ట‌ర్ కు నేనే డ‌బ్బింగ్ కూడా చెప్పాను.

వెంక‌టేష్ ట్రైల‌ర్ చూసి ఏమ‌న్నారు?
అవునండీ..వెంక‌టేష్ గారికి ట్రైల‌ర్ చూపించాం. మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా అడ్వైజెస్ కూడా ఇచ్చారు. మాట్లాడిన కొద్దిసేపైనా ఒక యాక్టింగ్ క్లాస్ లా అనిపించింది.
నెక్ట్స్ సినిమా మీ బేన‌ర్ లోనే ఉంటుందా?
నేను వైజాగ్ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్న‌ప్పుడు మా ఫాద‌ర్ వ‌చ్చారు. అక్క‌డ ఎంతో కొత్త‌వారు యాక్టింగ్ లో శిక్ష‌ణ తీసుకుంటున్నారు. ఎంతో మంది ప్ర‌తిభావంతులు ఉన్నారు. ఇలాంటి వారికి మ‌న వంతుగా అవ‌కాశం క‌ల్పించాలన్న ఉద్దేశంతో బేన‌ర్ స్టార్ట్ చేశారు. క‌చ్చితంగా నాతో పాటు కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తూ బ‌య‌ట వాళ్ల‌తో మా బేన‌ర్ లో సినిమాలు చేస్తాం. అలాగే స్టోరీస్ వింటున్నా. ఈ సినిమా విడుద‌ల‌య్యాక నా త‌దుప‌రి సినిమా ప్ర‌క‌టిస్తా. ఇక మీద‌ట హైద‌రాబాద్‌లోను ఉంటూ సినిమాకే అంకిత‌మ‌వ్వాల‌నుకుంటున్నా.

సినిమా రిలీజ్ ఎప్పుడు?
ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నాం. ఎక్క‌డా బోర్ లేకుండా సినిమా ఉంటుంది. మంచి సాంగ్స్ , సినిమ‌టోగ్ర‌ఫీ, కొరియోగ్ర‌ఫీ అన్నీ బాగా కుదిరాయి.

సినిమా రిలీజ్ అవుతోంది క‌దా టెన్ష‌న్ ఏమైనా ఉందా?
కొంచెం టెన్ష‌న్ అయితే ఉంది. కానీ మొద‌టి నుంచి నా మెంటాల్టీ ఏంటంటే ..ఏ ప‌ని చేసిన హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎఫ‌ర్ట్ పెడ‌తాను. కాబ‌ట్టి క‌చ్చితంగా స‌క్సెస్ అవుతామ‌న్న న‌మ్మ‌కం ఉంది. హిట్ట‌యితే నాన్నకు నేనిచ్చే రిట‌న్ గిఫ్ట్ అవుతుంది.

Dangal beauty Fatima sana shaikh cleavage showAllu arjun confirmed in sye raa narasimha reddyTopless Padma Lakshmi pizza party in bath tubNamrata comments on mahesh political entryNagababu sensational comments on Niharika marriage



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SyMBD6

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...