Skip to main content

భారీ ధర పలికిన యాత్ర తొలి టికెట్…. ఫిబ్రవరి 8న గ్రాండ్ రిలీజ్

జ‌న‌నేత‌గా తెలుగు వార్ గుండెల్లో ప‌దిల‌మైన చోటు ద‌క్కించుకున్న నాయ‌కుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన చేపట్టిన పాదయాత్ర ఆధారంగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం యాత్ర. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో జీవించారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. ఓవర్సీస్ లోనూ ఈ చిత్రానికున్న క్రేజ్ ఏంటో తెలిసింది. ఇటీవలే ప్రీమియర్ షో మొదటి టికెట్ ను సీటెల్ లో వేలం వేశారు. 70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, నిర్వాణ సంస్థలు అమెరికాలో సీటెల్‌లో ‘యాత్ర’ ప్రీమియర్‌ షో మొదటి టికెట్‌ను వేలం వేశాయి. ఈ వేలంలో మునీశ్వర్‌ రెడ్డి 6,116 డాలర్లకు(దాదాపు 4.37లక్షలు) మొదటి టికెట్‌ను గెలుచుకున్నారు. అయితే $12 విలువ చేసే టికెట్‌ను అతనికి అందించి.. మిగతా డబ్బులను వైఎస్సార్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తామని నిర్మాతలు తెలిపారు. రాజన్న క్యాంటీన్స్, వాటర్ ప్లాంట్స్ కోసం ఈ డబ్బును వెచ్చించనున్నారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న వారందరికీ నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ  చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు.
ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శ.శి దేవిరెడ్డి మాట్లాడుతూ… మమ్ముట్టి గారు వైఎస్ఆర్ గారి పాత్రలో నటించిన యాత్ర చిత్రాన్ని ఈనెల 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. ఈ సందర్బంగా యాత్ర ప్రీమియర్ ఫస్ట్ టికెట్ ను వేలం వేశాం. ఈ వేలంలో వైఎస్ఆర్ అభిమాని మునీశ్వర్ రెడ్డి 6,116 డాలర్లకు(దాదాపు 4.37లక్షలు) మొదటి టికెట్‌ను గెలుచుకున్నారు. అయితే $12 విలువ చేసే టికెట్‌ను అతనికి అందించి.. మిగతా డబ్బులను వైఎస్సార్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తాం. ఈ డబ్బుతో రాజన్న క్యాంటీన్స్, వాటర్ ప్లాంట్స్ కోసం వినియోగిస్తారు. ఈ వేలంలో పాల్గొన్న వారందరికీ స్పెషల్ థాంక్స్ తెలియజేస్తున్నాం. మా బ్యానర్ నుంచి  భ‌లేమంచిరోజు, ఆనందోబ్ర‌హ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే  నమ్మకంతో ఉన్నాం. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్ర‌లు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా చూడ‌వ‌ల‌సిన చిత్రంగా తెర‌కెక్కిస్తున్నాం. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్ర లో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నాం.  అని అన్నారు
నటీ నటులు
మమ్ముట్టి, రావ్ రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి…..తదితరులు
సాంకేతిక వర్గం
సినిమాటోగ్రాఫర్ – సత్యన్ సూర్యన్
మ్యూజిక్ – కె ( క్రిష్ణ కుమార్ )
ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్
సాహిత్యం – సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ప్రొడక్షన్ డిజైన్ – రామకృష్ణ, మోనిక సబ్బాని
సౌండ్ డిజైన్ – సింక్ సౌండ్
వి ఎఫ్ ఎక్స్ – Knack Studios
పి ఆర్ ఓ – ఏలూరు శ్రీను
సమర్పణ – శివ మేక
బ్యానర్ – 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు – విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – మహి వి రాఘవ్

Akhil 4 th film with srinu vaitlaFlop hero replaced Mahesh Babu nephew Galla AshokVidyabalan sensational comments on sual lifeJeetendra daughter Ekta kapoor turns MomSakshi chaudary sensational commentsSamantha in another controversy



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2MOiXDX

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...