Skip to main content

పాపులర్ “ప్రొవోక్” లైఫ్ స్టైల్ మ్యాగజైన్ పై అల్లు శిరీష్ స్లైలిష్ కవర్ ఫోటో

Allu Sirish becomes a new Sensational Style Icon for Provoke Magazineటాప్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ గా అంతర్జాతీయ గుర్తింపు సంపాదించుకున్న మ్యాగజైన్ ప్రొవోక్. ఫిబ్రవరి నెలకు గాను మ్యాగజైన్ కవర్ ఫొటోగా టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ది వేయడం విశేషం. దీనికోసం ప్రత్యేకంగా ఫొటోషూట్ చేశారు. స్టైలిష్ లుక్స్ తో అల్లు శిరీష్ కొత్తగా కనిపించాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫొటోషూట్ చేశారు. గుర్తింపు పొందిన లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కావడం, అల్లు శిరీష్ ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ ఫొటోషూట్ ని విభిన్నంగా అల్ట్రామోడ్రన్ కాన్సెప్ట్ తో ప్లాన్ చేశారు. ఇగ్నైట్, ఇన్నోవేట్, ఇన్ స్పైర్ ట్యాగ్ లైన్స్ గా నడుస్తున్న ఈ మ్యాగజైన్ కోసం అల్లు శిరీష్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓ టాలీవుడ్ స్టార్ కి దక్కిన గౌరవంగా ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్లు శిరీష్ సైతం ప్రొవోక్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ పై కవర్ ఫొటో రావడంతో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కవర్ ఫోటో కోసం తనను ఎంపిక చేసుకోవడం ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు.

 

అల్లు శిరీష్ తాజాగా నటిస్తున్న చిత్రం ఎబిసిడీ. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే హిందీ శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడైన విషయం తెలిసిందే. సీనియర్ నిర్మాత డి.సురేష్ బాబు ఈ చిత్రానికి సమర్ఫకులుగా వ్యవహరిస్తుండడం విశేషం. ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.  మెగా బ్రదర్ నాగబాబు ఇందులో అల్లు శిరీష్ కు తండ్రి పాత్రలో నటించారు.

బాలనటుడిగా మనకు సుపరిచితమైన భరత్ ఇందులో హీరో ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నాడు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్.

సంజీవ్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. బిగ్ బెన్ సినిమాస్ యశ్ రంగినేని తో కలిసి మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో మధుర శ్రీధర్ ఈ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

English Title; Allu Sirish becomes a new  Sensational Style Icon for Provoke Magazine

Akhil's Mr Majnu full movie leaked onlineHero Dhanush romance with senior heroineMalaika arora driver leaked her affairNagarjuna feared with NTR biopicPoor TRP Rating for Jr NTR 's Aravinda SamethaBollywood hero rajkumar rao crush on Aishwarya rai



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2G2L1To

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...