Skip to main content

ప్రేమసాగరం, ప్రేమదేశం రేంజ్‌లో.. ‘లవర్స్ డే’ అద్భుతమైన ఫీల్ ఉన్న చిత్రం

Lovers Day movie release on Feb14ఒకే ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా సంచలన రేపిన ప్రియా ప్రకాశ్ వారియర్, రావూఫ్ రోషన్ జంటగా నటించిన ”లవర్స్ డే ”(మలయాళంలో ఒరు ఆడార్ లవ్) చిత్రం రిలీజ్‌కు ముస్తాబైంది. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏక కాలంలో ప్రేమికుల రోజున అంటే ఫిబ్రవరి 14న విడుదల కానున్నది. క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై అందిస్తున్నారు.

 

నిర్మాత ఏ గురురాజ్ మాట్లాడుతూ.. “ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మూడే మూడు చిత్రాలు ఆకట్టుకొన్నాయి. ధనుష్ నటించిన ‘త్రీ’ చిత్రంలో కోలవెరి పాట, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే అంశం బాహుబలి చిత్రంపై భారీ క్రేజ్‌ను ఏర్పాటు చేసింది. అదే కోవలో ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్‌‌ కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. అందులో కన్నుగీటిన ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాను లవర్స్ డే పేరుతో ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నాం. ‘ఒరు ఆడార్ లవ్’ టీజర్ ద్వారా ఆకట్టుకొన్న ప్రియా వారియర్‌కు ఆరేళ్ల వయసు నుంచి అరవై ఏళ్లకు పైబడిన వారి నుంచి కూడా ఆదరణ లభించింది. ప్రియా వారియర్ క్రేజ్ వయసుతో నిమిత్తం లేకుండా గ్రామాలకు చేరింది. ఈ సినిమాపై క్రేజ్ పెరగడంతో తెలుగు హక్కులను దక్కించుకొనేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టిపోటి ఎదురైంది. దాంతో భారీ మొత్తాన్ని వెచ్చించి లవర్స్ డేను హక్కులను సొంతం చేసుకొన్నాం. లవర్స్ డే సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి సహకరించిన  సీతారామరాజు,సురేష్ వర్మ లకు  థ్యాంక్స్. గతంలో కుష్బూ, నదియా లాంటి వారిని సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు ఓమర్ లులు  ”లవర్స్ డే ”  రూపొందించారు. కొత్తవారితో అద్భుతమైన కంటెంట్‌తో తీసిన విధానం, కథను తెరకెక్కించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఉంది. లవర్స్ డే సినిమా చూసినప్పుడు మధ్యతరగతి వయసు వాళ్లు చూసినప్పుడు వారు తప్పకుండా తమ యూత్‌ రోజులను గుర్తు చేసుకొంటారు. స్నేహం, ప్రేమ విలువను అద్భుతంగా చెప్పారు. ప్రేక్షకుడు పెట్టిన ప్రతీ పైసా వసూల్ అవుతుంది. ‘లవర్స్ డే’ చిత్రంలో తొమ్మిది పాటలు ఉంటాయి. మేము విడుదల చేసిన ఎనిమిది పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తొమ్మిదో పాట థియేటర్‌లో ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ఆ పాటకు ప్రేక్షకులు లేచి సెల్యూట్ చేయడం ఖాయం. గతంలో వచ్చిన ప్రేమసాగరం, ప్రేమదేశం లాంటి సినిమాల రేంజ్‌లో ఉంటుంది. ఇప్పటివరకు నేను సొంతంగానే సినిమాలు చేశాను. తొలిసారి పంపిణీదారుడు, నిర్మాత వినోద్‌రెడ్డితో కలిసి నేను ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. వినోద్ రెడ్డి నిర్మాతగానే కాదు, మంచి స్నేహితుడిగా నాకు లభించారు’ అన్నారు .

నిర్మాత వినోద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అద్భుతమైన సినిమాను అందించిన ఓరు ఆడార్ లవ్ దర్శకుడు, నిర్మాతకు ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా థ్యాంక్స్  చెప్పుకోవాలి. ఆయన రావడం వల్ల మా సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లకుపైగా రిలీజ్ అవుతున్నది. తెలుగులో సుమారు 600 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. లవర్స్ డే చిత్రం చూసిన తర్వాత అద్భుతమైన ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు’ అని అన్నారు.

న‌టీన‌టులు:
ప్రియా వారియర్, నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు :
కెమెరా: శీను సిద్ధార్థ్‌
ఎడిటింగ్‌: అచ్చు విజ‌య‌న్‌
సంగీతం: షాన్ రెహ‌మాన్‌
స్క్రీన్‌ప్లే: సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు
నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి

English Title: Lovers Day movie release on Feb14



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SLHHlI

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...