
ఈ చిత్ర ట్రైలర్ ను తెలంగాణ రాష్ట్ర సమితి కార్యానిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు విడుదల చేశారు. అందరికీ నచ్చే సినిమాను చేయాలని ఆయన సూచించారు. జాగ్రత్తగా చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేసుకోమని ఆయన చిత్ర బృందానికి సూచించారు. తన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం దర్శకుడు ఏక్మా సాయి కుమార్ మాట్లాడుతూ…నేడు దేశమంతా అలుముకున్న సామాజిక సమస్యను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. స్త్రీలకు భద్రత కరువైన రోజుల్లో మనమున్నాం. తెరకెక్కే ప్రతి చిత్రంలో ప్రజలకు పనికొచ్చే ఇతివృత్తం ఉండాలని ఆలోచించి రాసుకున్న కథ ఇది. ఒక ఊరిలో వరుసగా యువతీ యువకుల ఆత్మహత్యలు జరుగుతుంటాయి. వాటికి కారణం ఏంటని అన్వేషిస్తూ సాగే కథాంశమిది. అందరిలో పెద్ద మనిషిగా చెలామణి అయ్యే కొందరు అసాంఘిక శక్తుల అసలు రూపాన్ని బయటపెడుతుందీ సినిమా. వాణిజ్య విలువలున్నా…ఎక్కడా అశ్లీలత కనిపించకుండా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సినిమాను రూపొందించాం. ప్రస్తుతం మిర్రర్ సినిమా సెన్సార్ మినహా అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ పూర్తి చేసి త్వరలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. సినిమాను మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. అన్నారు.
వినోద్ రాజ్, ఆంజనేయులు, విట్టలాచార్య, సుందర్ మధు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం – ఎన్ అర్జున్, సినిమాటోగ్రఫీ – కె అశోక్, ఎడిటర్ – బి నరేష్, సహ నిర్మాతలు – డి. లక్ష్మీ నారాయణ, తూమ్కుంట అరుణ్, నీలం అశోక్, వినోద్ రాజ్.
English Title: Mirror movie trailer launched by KTR
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Spyxf4

Comments
Post a Comment