Skip to main content

వాలంటైన్స్ డే స్పెష‌ల్ గా కుట్రపూరితమైన ప్రేమ‌క‌థ‌ను చూపించ‌బోతున్న ఆర్జీవి.

RGV.’s valentine’s day special ప‌దవులు పోయినా, ప్రాణాలు పోయినా, అయిన వారు వద్దూ వద్దన్నా ల‌క్ష్మి పార్వ‌తి చేయి వ‌ద‌ల‌ని ఎన్టీఆర్ ప్రేమ‌, అనే క‌థ ను వాలంటైన్స్ డే సంద‌ర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ రూపం లో ఒక బండరాయి విసరబోతున్నాడు ఆర్జీవి.. “ఇది కుటుంబ కుట్ర‌ల చిత్రం” అనే ట్యాగ్ లైన్ తో రాంగోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ సోష‌ల్ మీడియా లో ట్రెండ్ అవ్వటమే కాదు..చాలామంది లో చెమటలు పుట్టిస్తోంది

 

ఈ క‌థ‌ను ముందెన్నడూ వ‌ర్మ చూడని విధానం,తీయని విధానంలో  ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని తెలియని వాళ్ళు కూడా చెప్తున్నారు.

 

తెలుగు ప్ర‌జ‌ల‌కు ఆరాధ్య దైవంగా, తెలుగు ఖ్యాతిని న‌లుదిశ‌లా చేర‌వేసిన ఎన్టీఆర్ లోలోపలి లోని ఒక నిర్వీర్యమైన ప్రేమ‌క‌థ‌ను “ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ “లో ఆవిష్క‌రించ‌బోతున్నాడు రాంగోపాల్ వ‌ర్మ‌. తుది శ్వాస వ‌ద‌లే వ‌ర‌కూ ల‌క్ష్మీ పార్వ‌తి తన గౌర‌వాన్ని కాపాడిన ఎన్టీఆర్ జీవితం పై ఆమె ఎలాంటి ప్ర‌భావం చూపించలేదు..? లక్ష్మీ కోసం తన అన్నీ పణంగా పెట్టి పోరాడిన ఎన్టీఆర్, ల‌క్ష్మీ పార్వ‌తి ల మ‌ద్య అతి రహస్య సంబంధం ఏంటి?  విడ‌దీయ‌రాని ఆ ఆపవిత్ర బంధం ఎంటి..? ఇలాంటి అంశాలు కొంద‌రికి రుచించ‌క‌పోయినా, అవి తెలుగుప్ర‌జ‌ల‌ గొంతుల్లోకి దిగాల్సిన అవసరముంది కనుకనే ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ ఆయన కుటుంబ స‌భ్యుల‌కు, న‌మ్మ‌కంగా లేని అనుచ‌రుల‌కు, వెన్నుపోటుపొడిచిన కుట్ర దారుల‌కు లక్ష్మీస్ ఎన్టీఆర్ ముందుపోటు లా ఉంటుంది.

 

రాంగోపాల్ వ‌ర్మ చెప్ప‌బోయే ఈ క‌థ  ,ఎన్టీఆర్ మంచి విషయాలే కాదు, తన సొంత ఫ్యామిలీ వాళ్ళు చేసిన చెప్పుకోలేని పనులను కూడా అడ్డుకోలేని ఎన్టీఆర్ అమాయకత్వాన్ని  చూపెట్టబోతోంది.

అందుకే ఈ క‌థ నిజాల‌నే కత్తులతో మూకుమ్మడి దాడి చేయబోతోంది..తెలిసిన క‌థ‌లో తెలియ‌ని కథనాన్ని వెలికితీయ‌బోతుంది.

త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్దం అవుతున్న ఎన్టీఆర్ అస‌లు క‌థ తెలుగు తెర‌పై లక్ష్మీ ఆటం బాంబులను పేల్చడానికి సిద్దం అవుతోంది.వెలుగులు పంచిన వ్య‌క్తి చుట్టూ అలుముకున్న చీక‌ట్ల‌ను తెర‌మీద‌కు తీసుకొస్తున్నాడు వ‌ర్మ‌.. ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలిపే ట్రైలర్ ను ఫిబ్రవరి 14 న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు చాలా మంది వీపులలో గుచ్చబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ.

 

ఎ జివి ఆర్జీవి ఫిల్మ్స్ ప్రెజెంట్స్

 

దర్శకత్వం :రాం గోపాల్ వర్మ & అగస్త్య మంజు

ప్రొడ్యూసర్ :రాకేష్ రెడ్డి &దీప్తి బాలగిరి

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : రమ్మీ

రచన : రాం గోపాల్ వర్మ&నరేంద్ర చారి

మ్యూజిక్ : కళ్యాణ్ కోడూరి

ఎడిటర్ : కమల్ ఆర్

కాస్ట్యూమ్ డిజైనర్ : వెంకటేష్ జక్కుల

కొరియోగ్రఫీ : శంకర్ మాస్టర్

లిరిక్స్ : సిరా శ్రీ

పి ఆర్ ఓ : జీ ఎస్ కే మీడియా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి

ప్రొడక్షన్ కంట్రోలర్ : పాండి

సౌండ్ డిజైన్ : యతి రాజు

 



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2TIpP8C

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...