Skip to main content

కోర్టుకి వెళ్లయినా సినిమా విడుదల చేస్తాం – నిర్మాత వెంకట్‌

 Dandupalyam4 pressmeetబెనర్జీ, వెంకట్‌, ముమైతఖాన్‌, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌ కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. వెంకట్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘దండుపాళ్యం’ ట్రయాలజీకి ఎలాంటి సంబంధం లేదు. ఈ ‘దండుపాళ్యం-4’లో తమ జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4’ రూపొందింది. ఇందులో  ఏడుమంది గ్యాంగ్ కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ ‘‘సినిమా షూటింగ్‌, నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఇటీవల సెన్సార్‌ అప్లై చేశాను. కంటెంట్‌ పరంగా సినిమాలో ఏదన్నా సమస్య ఉంటే ఆ సన్నివేశాన్ని, డైలాగ్‌ని తొలగించడం జరుగుతుంది.
నా సినిమా చూసిన సెన్సార్‌ బోర్డ్‌ ఆఫీసర్‌ సినిమాలో కొన్ని సీన్లు తొలగించాలి.. లేదంటే రిజక్ట్‌ చేస్తానని చెప్పారు. సినిమాలో సమస్య ఏంటో చెప్పకుండా సినిమాను రిజెక్ట్‌ చేస్తాననడం  మొదటిసారి చూశా.
ఆ తర్వాత నేనీ సినిమా సెన్సార్‌ చెయ్యను. రివైజ్‌ కమిటీకి వెళ్లండన్నాడు. ప్రస్తుతం నేను అదే పని మీద ఉన్నా. రివైజ్‌ కమిటీనే కాదు..  ట్రిబ్యునల్ అదీ కాకపోతే..
కోర్టు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో సినిమా విడుదల చేస్తాం’’ అనని తెలిపారు. ‘‘ఇంతకన్నా క్రైమ్‌ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని విజయవంతంగా ఆడి థియేటర్స్‌ నుచి కూడా వెళ్లిపోయాయి. మా సినిమాతో సెన్సార్‌ బోర్డ్‌కి ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మార్చిలో సినిమా విడదల చేస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. కన్నడలో దండుపాళ్యంలో నటించడం వల్ల అక్కడ మరో రెండు సినిమాల్లో అవకశం వచ్చిందని డి.ఎస్‌.రావు చెప్పారు. ముత్యాల రాందాసు, బెనర్జీ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దండుపాళ్యం 4’*
బ్యానర్   వెంకట్ మూవీస్
నటీ నటులు :
బెనర్జీ , వెంకట్
సుమన్ రంగనాథన్,  ముమైత్ ఖాన్,     సంజీవ్ కుమార్ , అరుణ్ బచ్చన్,  డిఎస్ రావు, , రాక్ లైన్  సుధాకర్ బులెట్ సోము,  విఠల్ రంగయన్,  జీవ సైమన్ , సంతోష్ కుమార్, వీణ పొన్నప్పన్  , స్నేహ , రిచర్డ్  శాస్త్రి తదితరులు.
డైలాగ్స్ : ఎం. రాజశేఖర్ రెడ్డి
మ్యూజిక్ : ఆనంద్ రాజా విక్రమ
లిరిసిస్ట్ :  భువనచంద్ర
డి ఓ పి: .గిరి బెనకరాజు
కోరియోగ్రఫీ : బాబా భాస్కర్
ఎడిటర్ : బాబు ఏ  శ్రీవాత్సవ – ప్రీతి మోహన్
పోరాటాలు: కుంగ్ ఫు చంద్రు
నిర్మాత: వెంకట్
దర్శకత్వం: కె.టి.నాయ
English Title:  Dandupalyam4 pressmeet

Akhil's Mr Majnu full movie leaked onlineFlop hero replaced Mahesh Babu nephew Galla Ashokupasana condensed about her political entryNagarjuna feared with NTR biopicPoor TRP Rating for Jr NTR 's Aravinda SamethaCasting call for Sharwanand 96



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2G6YwBH

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...