
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…. వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న నాగకన్య ట్రైలర్ పై సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా మొదటి పోస్టర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ లుక్ ని, రెండో పోస్టర్ గా లక్ష్మిరాయ్ లుక్ ని విడుదల చేశాం. మూడో పోస్టర్ గా కేథరీన్ లుక్ ని విడుదల చేశాం. ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్ పై వస్తున్న స్పందనతో చాలా హ్యాపీగా ఉన్నాం. విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. జై క్యారెక్టర్ మరో హైలైట్ గా నిలుస్తుంది. డైరెక్టర్ సురేష్ స్టోరీ, స్క్రీన్ ప్లే క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాం. వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ పాత్రలు వూహించని విధంగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కు మంచి పేరొచ్చేలా ఉంటుంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. అని అన్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2RTydAp

Comments
Post a Comment