Skip to main content

క్లాసిక్ హార‌ర్ చిత్రంగా `అమావాస్య` ప్రేక్ష‌కులను మెప్పిస్తుంది – స‌చిన్ జోషి

Amavasya movie to  released on Feb 8`మౌన‌మేల‌నోయి, నిను చూడ‌క నేనుండ‌లేను, ఒరేయ్ పండు, నీ జ‌త‌గా నేనుండాలి` వంటి చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్షకుల‌ను మెప్పించిన న‌టుడు స‌చిన్ జోషి హీరోగా వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌ పై ‘1920 ఈవిల్‌ రిటర్స్స్‌’, ‘రాగిని యంయంఎస్‌, ‘అలోన్‌’ లాంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు భూషన్‌ పటేల్‌ దర్శకత్వంలో రైనా సచిన్‌జోషి, దీపెన్‌ఆమిన్‌ నిర్మాణంలో రూపొందిన హార‌ర్ చిత్రం ‘అమావాస్య`. న‌ర్గిస్ ఫ‌క్రి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుద‌ల కానుంది. ఈ సందర్భంగా… సచిన్‌జోషి ఇంటర్వ్యూ.

చాలా గ్యాప్ తరువాత మళ్లీ ‘అమావాస్య’ అని వస్తున్నారు ?

– నేను చాలా కాలంగా హార‌ర్ సినిమా చేయాల‌ని ఎదురుచూస్తున్నాను. అలాంటి స‌మ‌యంలో భూష‌ణ్ ప‌టేల్ నాకు ఈ స్క్రిప్ట్ గురించి చెప్పారు. నా గ‌త చిత్రాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన సినిమా. అమావాస్య ఓ క్లాసిక్ హార‌ర్ మూవీ. తెలుగులో హార‌ర్ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ దొరుకుతున్న స‌మ‌యంలో మంచి కాన్సెప్ట్‌తో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది.

ఈ సినిమా ప్రోమోలు చూస్తుంటే.. ఇది పూర్తిగా హారర్ నేపథ్యంలో సాగుతున్నట్లు అనిపిస్తోంది ?

– అవునండి.. ఇది పూర్తిగా హర్రర్ నేపథ్యంలోనే సాగుతుంది. సినిమాలోని కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. అలాగే డైరెక్టర్ భూషణ్ పటేల్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే.. అమావాస్య ఒక క్లాసిక్ హర్రర్ ఫిల్మ్.

ఇప్ప‌టి వ‌ర‌కు చాలా హార‌ర్ సినిమాలు వ‌చ్చాయి క‌దా ?

– ఫస్ట్ రెగ్యూలర్ గా వచ్చే హర్రర్ సినిమాలా ఉండదు ఈ సినిమా. మెయిన్ గా సినిమాలో కనిపించే వి.ఎఫ్.ఎక్స్ చాలా కొత్తగా, వైవిధ్యంగా ఉంటాయి. అన్నిటికి మించి ‘అమావాస్య‌’లో ఆకట్టుకునే గొప్ప స్టోరీ ఉంది. సినిమాకే స్టోరీ హైలెట్ గా నిలుస్తోంది. అదేవిధంగా ఇంటర్నల్ గా సినిమాలో ఎంతవరకు రాని ఒక యూనిక్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి?

– ఈ చిత్రంలో నేను క‌ర‌ణ్ అనే పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. న‌ర్గిస్ ఫ‌క్రి అహానా అనే అమ్మాయి పాత్ర‌లో న‌టించింది. నేను న‌ర్గిస్‌ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన‌ప్పుడు ఆమె వీకెండ్‌లో స‌మ్మ‌ర్ హౌస్‌కి వెళ్లాల‌ని అంటుంది. కానీ హీరోకి ఆ ఇంటికి వెళ్ల‌డం ఇష్టం ఉండ‌దు. అలాంటి స‌మయంలో వారు ఆ ఇంటికి ఎలా వెళ్లారు? అక్క‌డ వారికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదురయ్యాయ‌నేదే సినిమా. ఆ వీకెండ్‌లో అమావాస్య రాత్రి ఈవిల్ ఏం చేసింద‌నేదే సినిమా.ఈ సినిమా హిందీ మరియు తెలుగులో విడుదల కాబోతుంది.

అంటే రెండు భాషల్లోనూ షూట్ చేశారా ?

– సినిమాను రెండు భాష‌ల్లో చిత్రీక‌రించాం. ముఖ్యంగా క్లోజ‌ప్ షాట్స్‌ను తెలుగులో చిత్రీక‌రించాం. ఎందుకంటే తెలుగు సినిమాకు నా తొలి ప్రాధాన్య‌త ఎప్పుడూ ఉంటుంది.

మీ డైరెక్టర్ గురించి చెప్పండి ?

– ఆయన హర్రర్ ఫిల్మ్ స్పెషలిస్ట్. పైగా ఈ సారి కథనే చాలా కొత్తగా రాసారు. ఇక ఆయన ఇప్పటివరకూ తీసిన 1920 ఈవిల్ రిటర్న్స్, రాగిణి ఎం ఎం ఎస్ ,అలోన్ సినిమాలు హర్రర్ సినిమాలే. ఒక హర్రర్ సినిమాకు ఏమి కావాలో ఆయనకు బాగా తెలుసు. ఈ జోనర్ అంటే ఆయనకు బాగా ఇష్టం. ఆయన చూసి నాక్కూడా ఈ జోనర్ పై ఇష్టం పెరిగింది. ఇప్పుడు ప్రతి హర్రర్ ఫిల్మ్ చూస్తున్నాను.

ఈ సినిమాలో మీకు జోడిగా నటించిన హీరోయిన్ నర్గీస్ ఫక్రీ గురించి చెప్పండి ?

– నర్గీస్ ఫక్రీ చాలా బాగా చేసింది. తను హార్డ్ వర్కర్. ప్రతి సీన్ చేసే ముందు, ఆ సీన్ లోని సోల్ ను పట్టుకొని యాక్ట్ చెయ్యటానికి ట్రై చేసేది. సినిమా పట్ల తనకున్న డెడికేషన్ చాలా గొప్పది.

హారర్ సినిమాలు అంటే మ్యూజిక్ కి ఎక్కువ ప్రాధాన్యముంటుంది కదా?

– అవునండి! ఒక్క హారర్ సినిమాలకే కాదు ఇండియాలో మ్యూజిక్ కి మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కువ సంగీతప్రియులు ఇండియాలోనే ఉంటారు. నేను కూడాసంగీతాభిమానినే, నేను తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు కూడా దగ్గరుండి మ్యూజిక్ చేయించుకుంటాను. నా తొలి చిత్రం మౌనమేలనోయి సినిమాలో ‘ఓ ప్రియురాలా…’ పాటని రమణ గోగుల గారి దగ్గిర 3 రోజులు కూర్చుని చేయించుకున్నాను. సాధార‌ణంగా హార‌ర్ సినిమాల‌ను డైరెక్ట్ చేసే ద‌ర్శ‌కులు హార‌ర్ సినిమాల‌ను ఎంత ఆస‌క్తికరంగా తెర‌కెక్కించాం.. ఎంత మంచి సౌండ్ టెక్నాల‌జీని ఉప‌యోగించాం అని చూస్తారు. ఇక్కడ క‌థ‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. హాలీవుడ్ స్థాయిలో హార‌ర్ చిత్రాన్ని అందించాల‌ని ఛాలెంజింగ్‌గా భావించి ఈ సినిమా చేశాం.

ఈ సినిమాలో అలీ అజ్గర్ పాత్ర ఎలా ఉటుంది..?

– ఈ సినిమాలో మేము వీకెండ్ కి వెళ్లే బంగ్లా కి కేర్ టేకర్ పాత్రలో అలీ అజ్గర్ కనిపిస్తాడు. డైరెక్టర్ ఆయన పాత్రని డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. ఆయన క్యారెక్టర్ కి ఈ సినిమాలో మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఎవ్వరు ఉండని ఈ హాంటెడ్ బంగ్లా కి అలీ అజ్గర్ ఎందుకు కేర్ టేకర్ గా ఉంటాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మీ తదుపరి చిత్రాలు గురించి చెప్పండి ?

– ఒకటి రెండు స్టోరీస్ విన్నాను. చాలా బాగున్నాయి. అయితే నెక్స్ట్ సినిమా ఏం చెయ్యాలో ఇంకా నిర్ణయించుకోలేదు. మా ‘అమావాస్’ రిలీజ్ అయిన తరువాతే, ఏ జోనర్ లో ఎలాంటి సినిమా చెయ్యాలో ఆలోచిస్తాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో సచిన్ జోషి.

English Title: Amavasya movie to  released on Feb 8

Akhil 4 th film with srinu vaitlaFlop hero replaced Mahesh Babu nephew Galla AshokVidyabalan sensational comments on sual lifeJeetendra daughter Ekta kapoor turns MomSakshi chaudary sensational commentsSamantha in another controversy



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2UCh0wO

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...